దేవినేని అవినాష్‌. విజ‌య‌వాడ‌కు చెందిన దివంగ‌త దేవినేని నెహ్రూ వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చే సిన అవినాష్ .. ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద విజ‌యం అంటూ ఏమీ సాధించ‌లేదు. అయితే, దూకుడుగా రాజకీయా లు చేయ‌డం, పార్టీ సిద్ధాంతాల‌కు క‌ట్టుబ‌డి ప్ర‌వ‌ర్తించ‌డం అనేవి ఆయ‌న‌కు పెట్ట‌ని కోట‌లుగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న 2014 ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటి చేసి ఓడినా.. తాజా ఎన్నిక‌ల్లో గుడివాడ నుంచి పోటీ చేసి ప‌రాజ‌యం పొందినా కూడా కేడ‌ర్‌లో మాత్రం ప‌ట్టు నిలుపుకొన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న హ‌వా మ‌రింత పెరుగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


తాజాగా అవినాష్‌కు ఊహించ‌ని ఆఫ‌ర్ ఒక‌టి త‌గిలింది. ప్ర‌స్తుతం ఖాళీ అయిన కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం ని యోజ‌క‌వ‌ర్గం బాధ్య‌త‌ల‌ను అవినాష్‌కు అప్ప‌గించాల‌ని ఈ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కార్య‌క‌ర్త‌లు పెద్ద పె ట్టున డిమాండ్ చేశారు. తాజాగా రెండు రోజుల నుంచి టీడీపీ అదినేత చంద్ర‌బాబు  ఎన్నిక‌ల్లో పార్టీ వైఫ ల్యంపై చంద్ర‌బాబు జిల్లాల వారీగా విజ‌య‌వాడ‌లో విస్తృత స్థాయి స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు. గురువారం ఈ క్ర‌మంలోనే ఆయ‌న గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో మారిన ప‌రిస్థితిపై చ‌ర్చించారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇక్క‌డ పార్టీ గెలిచినా.. ఎమ్మెల్యే వంశీ పార్టీకి, ప‌ద‌వికి కూడా రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే.


ఈ నేప‌థ్యంలో గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంపై స‌మీక్ష సంద‌ర్భంగా ఈ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కార్య‌క‌ర్త‌లు ఇక్క‌డి బాధ్య‌త‌ల‌ను దేవినేని అవినాష్‌కు ఇవ్వాల‌నినినాదాలు చేయ‌డం ఆస‌క్తిగా మారింది. వంశీ పార్టీని వీడినా తాము మాత్రం టీడీపీని వీడే ప్రసక్తేలేద‌ని,  చంద్రబాబు మాటే తమకు శిరోధార్యమని, నియోజ‌క వ‌ర్గంలో నాయకత్వ మార్పు చేయాల్సివస్తే దేవినేని అవినాష్‌కు గన్నవరం బాధ్యతలు అప్పగించాలని కార్యకర్తలు పట్టుబట్టారు. దీంతో ఇప్పుడు అవినాష్ వైపు త‌మ్ముళ్లు దృష్టి పెట్టారు. ఇక్క‌డ టికెట్ ఇస్తే.. లేదా ఇంచార్జ్‌గా బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే.. అవినాష్ నెట్టుకురాగ‌ల‌డా? అనేది చ‌ర్చ‌కు వ‌స్తోంది.


వంశీ రాజీనామాతో ఇక్క‌డ ఉప ఎన్నిక ఖాయ‌మైంది. దీంతో ఈ టికెట్ను టీడీపీ త‌ర‌ఫున అవినాష్‌కు ఇస్తే.. ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కుతాడా? అనేది చ‌ర్చ‌కు వ‌స్తోంది. గుడివాడ‌లో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో అవి నాష్ త‌న సామాజిక వ‌ర్గానికే చెందిన కొడాలి నానిపై ఓడిపోయారు. ఇప్పుడు గ‌న్న‌వ‌రంలో టికెట్ ఇస్తే.. ఆయ‌న గెలుపు కొంత వ‌ర‌కు మెరుగ‌వుతుంద‌ని అంటున్నారు. ఇక్క‌డ వైసీపీ త‌ర‌ఫున మ‌ళ్లీ వంశీకే టికెట్ ఇచ్చినా ఫైట్ మాత్రం ట‌ఫ్‌గా ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో వంశీ గెలుపును అవినాష్ శాసించే ప‌రిస్తితి ఉంటుంద‌ని కూడా చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: