చంద్రబాబుకు ఉన్నంత రాజకీయ అనుభవం ఏ రాజకీయ నేత కు లేదు అనడం లో అతిశయోక్తి లేదు. అలాగే మీడియాను మేనేజ్ చేయడం లోనూ చంద్రబాబు దిట్ట. తనకున్న నలభై సంవత్సరాల రాజకీయ అనుభవంతో ఆయన అధికారం లో లేకున్నా మీడియాను తన గుప్పిట్లో ఉంచుకున్నారు. అధికారంగా బయటకు చెప్పకపోయినా చాలా మీడియా వర్గాలు చంద్రబాబు చెప్పుచేతల్లోనే నడుస్తాయి అన్నది వాస్తవం. అలా మీడియా ను అడ్డుపెట్టుకొని వైకాపా పై విష ప్రచారం చేస్తున్నారు అంటూ వైసీపీ కార్యకర్తలు చానాళ్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


దీనికి కారణం లేకపోలేదు, జగన్ తొలిసారిగా సీఎం గా ఎంపికైనప్పటి నుంచి జగన్ పై ఒక్క సాక్షి మీడియా తప్ప ఇతర ఏ మీడియా వాళ్ళు కూడా జగన్ కు పాజిటివ్ గా రెస్పాండ్ కావడంలేదు అనే చెప్పాలి. జగన్ అధికారం చేపట్టాక ఎవ్వరూ చేయాలని విధంగా కొద్ది కాలంలొనే మంచి నిర్ణయాలు తీసుకుని అద్భుతమైన పథకాలు అమలుపరిచారు. ముఖ్యంగా ఆయన రాష్ట్రం లోని నిరుద్యోగ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించారు. లక్షల మంది నిరోద్యోగులకు ఆసరా కలిపించారు.


అయితే జగన్ ఇన్ని చేస్తూ వచ్చినా కూడా ప్రజల్లో మాత్రం నెగటివ్ కోణాన్ని కొన్ని మీడియా వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. చేసిన మంచి చూపించకపోయినా పర్లేదు కానీ జగన్ పై చెడు ప్రచారం చేస్తున్నారు అంటూ వైసిపి కార్యకర్తలు కొన్ని మీడియా ఛానల్స్ పై మండిపడుతున్నారు. ప్రజల్లో జగన్ ను బ్యాడ్ గా చూపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


చంద్రబాబు ఈ మధ్యకాలంలో చాలా సార్లు మీడియా పెద్దలతో సమావేశం అయ్యారని వారితో కూడా జగన్ కు వ్యతిరేకంగా వార్తలు రాయాలని చెప్పారట. ప్రతి శుక్రవారం చంద్రబాబు హైదరాబాద్ లో మీడియా వాళ్ళతో భేటీ అయి ఎడిటర్ లతో రహస్యంగా మంతనాలు జరువుతున్నారు. లోకల్ మీడియా తోనే కాకుండా జాతీయ మీడియాతో కూడా భేటీ అయ్యారట. దీపావళి నాడు తన నివాసంలో జాతీయ మీడియా వర్గాలతో చర్చలు జరిపారని భోగట్టా. 


వారితో ముఖ్యంగా వైకాపా వ్యతిరేకంగా అలాగే తమ పార్టీ కి అనుకూలంగా వార్తలు రాయాలని సూచించారట. అదే విధంగా నవంబర్ 4 న జరిగే జనసేన లాంగ్ మార్చ్ ను బాగా కవర్ చేయాలని అన్నారట. తమ పార్టీ సోషల్ మీడియా విభాగానికి కూడా అలర్ట్ గా ఉండాలంటూ ఆదేశించరని సమాచారం. జాతీయ మీడియాలో ప్రసారం అయ్యే కథనాలను వెంటనే సోషల్ మీడియా లో వచ్చేలా చూసుకోవాలని చెప్పారు.


మొన్న జరిగిన ఇసుక విషయం దగ్గరి నుంచి నిన్నటి పార్టీ రంగులు వేయడం విషయం వరకు లోకల్ మరియు జాతీయ మీడియాలో వ్యతిరేకంగా కథనాలు రాయడం ద్వారా వారికి టీడీపీ నుంచి బాగానే నిధులు అందాయి అని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇలా చంద్రబాబు వైసీపి నాశననికి కుట్రపన్నారు అని అధికార పార్టీ వర్గాలు వాపోతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: