మరో రెండు రోజుల తర్వాత నుండి అంటే నవంబర్ 3వ తేదీ నుండి చంద్రబాబునాయుడుకి టెన్షన్ పెరిగిపోవటం ఖాయమనే అనిపిస్తోంది. నవంబర్ 3వ తేదీకి ప్రత్యేకత ఏమిటి ? ఏమిటంటే ఆరోజు తెలుగుదేశంపార్టీకి, ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసిన గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ వైసిపిలో చేరబోతున్నారట. ఆరోజు ముహూర్తం బాగుందన్న ఉద్దేశ్యంతో వంశీ వైసిపి కండువా కప్పుకోబోతున్నారని సమాచారం.

 

సరే వంశీ విషయం అంటే నాలుగు రోజుల క్రితమే బయటపడింది. అయితే అతి తొందరలో వంశీ బాటలోనే నడవటానికి మరో ముగ్గురు ఎంఎల్ఏలు కూడా రెడీ అయిపోయారట. ప్రకాశం జిల్లాలోని నలుగురు ఎంఎల్ఏల్లో ముగ్గురు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నట్లు రెండు పార్టీల్లోను ప్రచారం జరుగుతోంది.

 

మొన్నటి ఎన్నికల్లో టిడిపి తరపున చీరాలలో కరణం బలరాం, అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్, కొండెపిలో బాల వీరాంజనేయస్వామి, పర్చూరులో ఏలూరి సాంబశివరావు గెలిచారు. అయితే గెలిచిన దగ్గర నుండి కూడా వీళ్ళనలుగురూ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొంటున్నది లేదు.

 

కరణం అయితే ఏకంగా వైసిపి ఎంపి మాగుంట శ్రీనివాసులరెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొనటం టిడిపిలో సంచలనంగా మారింది. అసలే కరణంపై చంద్రబాబులో అనుమానాలున్నాయి. అలాంటిది పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా వైసిపి నేతలతో తిరుగుతుండటమే చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. అలాగే గొట్టిపాటి వ్యవహారంలో కూడా చంద్రబాబులో అనుమానాలు మొదలయ్యాయి.

 

అంటే వీళ్ళద్దరు పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు బాగా ప్రచారం జరుగుతోంది. ఇక వీళ్ళద్దరికి తోడు మిగిలిన ఇద్దరిలో ఒక ఎంఎల్ఏ కూడా వైసిపిలో చేరటం ఖాయమని చెప్పుకుంటున్నారు. మిగిలిన ఇద్దరిలో కూడా ఎవరంటే అందరూ ఏలూరు సాంబశివరావు అనే చెబుతున్నారు.

 

మరి ఇదే గనుక నిజమైతే రాజీనామాలు ప్రకాశం జిల్లాతో మాత్రమే ఆగవన్న విషయం అందరకీ తెలిసిందే. వెంటనే విశాఖపట్నం జిల్లాలో కూడా ఇద్దరు ఎంఎల్ఏలు వైసిపిలో చేరటానికి సిద్ధంగా ఉన్నట్లు ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద నవంబర్ నెలలో చంద్రబాబు టెన్షన్ పెరిగిపోవటం ఖాయమనే అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: