పాకిస్తాన్ త్రీవ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విషయము ప్రజలందరికీ తెలుసు నటువంటిదే..పాకిస్తాన్ దేశ పరిస్థితి అత్యంత దారుణమైన స్థితికి చేరుకున్నది. అని ప్రజలు భావిస్తున్నారు. పాకిస్తాన్ దేశ ఆర్థిక వ్యవస్థను ఒక క్రమములో పెట్టడంలో ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చాలా ఘోరంగా విఫలమయ్యారు. ఇమ్రాన్ ఖాన్ తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కాశ్మీర్ సమస్యను ఒక సాకుగా చూపెట్టి పబ్బం గడపాలి అనుకున్నారు. 


పాకిస్తాన్  దేశ ప్రజలు ఇటీవల తాజాగా జరిగిన ఓ సర్వేలో తగిన తీర్పు చెప్పారు. పాకిస్తాన్లో ఈ మధ్య విపరీతంగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు దేశ ఆర్థిక వ్యవస్థ తమని తీవ్రంగా కలచివేస్తున్నయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మధ్యకాలంలో గాలప్ ఇంటర్నేషనల్ సంస్థ పాకిస్తాన్లో నిర్వహించిన సర్వే అక్కడ అ క్షేత్రస్థాయి పరిస్థితులకు అద్దం పట్టినట్లు చూపించింది. పాక్ లో 53 శాతం మంది ప్రజలు ఆ దేశ ఆర్థిక సంక్షోభానికి గురి అవుతున్నట్లు ప్రధాన సమస్యగా భావిస్తున్నట్లు సర్వే ఇటీవల చెప్పింది. 


ఆకులో చాలామంది ప్రజలు నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్నారు. నిరుద్యోగ శాతము దాదాపు 23 శాతం ఉందని తేల్చి చెప్పారు. పాక్లో నీటి కొరత సమస్య ఎక్కువగా ఉన్నట్లు సర్వే పేర్కొన్నది. నాలుగు శాతం మంది ప్రజలు అవినీతిని అనుసరిస్తున్నారని కూడా సర్వే పేర్కొంది. పాకిస్తాన్లో త్రీవ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే దీనివలన ఆ దేశ పరిస్థితి దారుణ స్థితికి చేరుకుందని సాహస నిర్ణయాలు తీసుకోవలసిన సమయము ఆసన్నమైందని గత జులై నెలలో అంతర్జాతీయ ద్రవ్య నిధి హెచ్చరించింది. 


ఇంకా విచిత్ర మైన విషయము ఏమిటి అంటే జూలై నాటికి ఖజానాలో కేవలం ఎనిమిది బిలియన్ డాలర్ల నిధులు ఉండడము ఆశ్చర్యకరమైన విషయము. అంటే అది కేవలము 1.7 నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. కాశ్మీర్ ని కేవలము 8 శాతం మంది ప్రజలు మాత్రమే సమస్యగా భావిస్తున్నారని సర్వే కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది. కాశ్మీరు ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తి రాజ్యం చేస్తున్న ఇమ్రాన్ ప్రభుత్వానికి కేవలం 8 శాతం మంది ప్రజలు మాత్రమే మద్దతుగా నిలవడం ఇమ్రాన్ కు చెంప పెట్టెనని చెప్పుకోవాలి.


ఇటువంటి పరిస్థితులలో ఐ.ఎం.ఎఫ్ 6 బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీతో  పాక్  దేశానికి అండగా నిలబడింది అలాగే సౌదీ అరేబియా, ఖతార్, యూ ఏ ఈ సైతము పాక్ దేశ సామాన్య ప్రజలను మనసులో పెట్టుకొని ఆర్థిక సహాయానికి ముందుకు వచ్చాయి అలాగే మరికొన్ని దేశాలు కూడా దేశానికి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రావాలని సూచిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: