ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి దిశ వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతున్నారు. మాటతప్పని మడిమ తిప్పని నాయకునిగా పేరు ప్రతిష్టతలు మూటగట్టుకుంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయం,  ఏపీ సీఎం జగన్ లక్ష్యం పోలవరం పూర్తయ్యే దిశగా శరవేగంగా పనులు ప్రారంభమయ్యాయి. 


పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులన్నీ ఇప్పటికే తొలిగిపోగా.. రివర్స్ టెండరింగ్ ద్వారా పనులు దక్కించుకున్న మేఘా ఇంజినీరింగ్ పనులు ప్రారంభించేసింది. భూమిపూజ చేసి తన పని తాను చేసుకుపోతోంది. మరోవైపు వరదల కారణంగా దెబ్బతిన్న కట్టను తిరిగి కట్టబోతున్నారు. హైకోర్టు తీర్పుతో రివర్స్ టెండరింగ్ విధానం పూర్తిగా ఫలితం సాధించడంతో ముఖ్యమంత్రి సమర్థత ఏంటో రుజువైపోయింది. గతంలో పోలవరాన్ని సందర్శించినపుడు.. నవంబర్ లో పనులు మొదలుపెడతామని జగన్ ఇచ్చిన హామీ నెరవేరింది.   


పోలవరం విషయంలో ముఖ్యమంత్రి జగన్ నాలుగు నెలల క్రితమే ఆడిట్ నిర్వహించారు. పోలవరం పనులు ఎంతవరకు పూర్తయ్యాయి.. నిర్మాణాల నాణ్యతపై నిశితంగా పరిశీలించారు. ఆ సమయంలోనే పోలవరాన్ని 2021 జూన్ కల్లా పర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు ప్రాజెక్ట్ నిర్వాసితుల నష్టపరిహారం గురించి అధికారులకు ఆ సమయంలోనే ఆదేశాలు జారీ చేశారు. ఆ లక్ష్యంలోనే భాగంగానే రివర్స్ టెండరింగ్ ద్వారా 844కోట్ల రూపాయలు ఆదా చేశారు. 


సాగునీటి ప్రాజెక్టులను శరేవేగంగా పూర్తి చేస్తామనీ.. .పోలవరానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామంటూ చెప్పినట్టుగానే జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేయడమే కాదు.. ప్రాజెక్టులపై లోతైన సమీక్షలు జరిపారు. రిజర్వాయర్లు,  కాల్వల సామర్థ్యం పెంచడం, కొత్త డ్యామ్ ల ఏర్పాటుకు అంగీకారం లాంటి నిర్ణయాలతో పాటు.. బడ్జెట్ కేటాయింపులు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: