ఒడిసాకు చెందిన సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇసుక తెరలపై అద్భుతమైన కళాకండాలకు  ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు.  సుదర్శన్ పట్నాయక్ ఆవిష్కరించిన ఈ సందేశాత్మక కళాకండాల చూపరులను ఆకట్టుకుంటాయి. పతన ఏడేళ్ళ ప్రాయం నుంచి సైకత శిల్పాలను వేయడం నేర్చుకున్నాడు. శిలలను శిల్పాలుగా మార్చి గణతికెక్కిన ఎందరో శిల్పులకన్నా భిన్నంగా ఈయన సముద్రపు ఒడ్డును, ఇసుకను తన కళాత్మక ప్రతిభతో శిల్పాలుగా మార్చి...సందర్శకుల ప్రశంసలతో పాటు... భారత రాష్టప్రతి పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. 

ఇప్పుడు  సైకత శిల్పి..ప్రతిష్టాత్మక ఇటాలియన్ గోల్డెన్ సాండ్ ఆర్ట్ అవార్డు 2019కు ఎంపికయ్యారు.  ఇటలీలో నిర్వహించనున్న అంతర్జాతీయ సాండ్​ నేటివిటీ కార్యక్రమంలో సుదర్శన్ ఈ పురస్కారం అందుకోనున్నారు. నవంబరు 13 నుంచి 18 వరకు ఈ వేడుక జరగనుంది.  ఈ మేరకు పట్నాయక్‌కు ఇప్పటికే ఆహ్వానం అందింది. ఎనిమిది మంది శిల్పులు పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో పట్నాయక్​ భారత్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఈ అవార్డుకు ఎంపికైనందుకు చాలా ఆనందంగా ఉందని పట్నాయక్​ తెలిపారు. 


ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​ ట్విట్టర్​ వేదికగా సుదర్శన్​కు అభినందనలు తెలిపారు. కాగా సుదర్శన్ పట్నాయక్ సేవలకు గానూ భారత ప్రభుత్వం ఆయనను 2014లో నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో గౌరవించిన సంగతి తెలిసిందే.
సుదర్శన్ పట్నాయక్ ఉద్దేశం ప్రకారం అనేక సైకత శిల్పాలను సృజనాత్మకంగానే కాకుండా ఒక సందేశాన్ని ప్రజలకు అందించాలనే సంకల్పం మనకు కనిపిస్తుంది.

దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు పర్యటించి సైకత శిల్పాలపై వర్క్ షాప్ లను శిక్షణను ప్రజలకందించాడు.ప్రతి జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాల సందర్భంగా సుదర్శన్ పట్నాయక్ వినూత్నంగా తన సైకత శిల్పాలను రూపొందిస్తూ ఉంటారు. చంద్రయాన్ 2, వివిధ సినీతారల పుట్టినరోజులు, జాతీయ దినోత్సవాలను పురస్కరించుకుని సైకత శిల్పాలను తయారుచేసి ఉంచుతుంటారు. అభినందన్ వర్థమాన్ పాకిస్తాన్ చెరనుంచి విడుదలయ్యాక కూడా తన ప్రతిభకు పదునుపెట్టి వినూత్నంగా సైకతశిల్పం తయారుచేశాడు సుదర్శన్ పట్నాయక్.


మరింత సమాచారం తెలుసుకోండి: