తెలంగాణ ఆర్టీసీ సమ్మె పై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నేడు సాయంత్రం క్యాబినెట్ భేటీ జరిగింది . గత 28 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసి సమ్మెఫై  ప్రధానంగా చర్చించేందుకు క్యాబినెట్ సమావేశం జరిగింది. కాగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. దాదాపు 5 గంటలపాటు సాగిన క్యాబినెట్ మీటింగ్ పలు ముఖ్య అంశాలను చర్చించారు. క్యాబినెట్  సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్... క్యాబినెట్ భేటీలో 49 అంశాలపై ప్రధానంగా చర్చించామని తెలిపారు. గత 28 రోజులుగా రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె చేపడుతున్న నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె పై సుదీర్ఘంగా చర్చించామని  తెలిపారు కేసీఆర్. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెను తప్పుబట్టారు... పండుగలు పరీక్షలు వంటి ఆర్టీసీకి ఆదాయం సమకూర్చే కీలక సమయాల్లో...సమ్మె అంటూ  బెదిరింపులకు దిగడం ఎట్టిపరిస్థితిలోనూ అంగీకరించ కూడదని నిర్ణయించమని  ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సున్నితమైన సమయాల్లో సమ్మె  చేయడం బ్లాక్ మెయిల్ కు  దిగడం లాంటిది అంటూ ఆరోపించారు. 

 

 

 

 అయితే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టొద్దు అని  ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా వినకుండా ఆర్టీసీ సమ్మె మొదలు పెట్టారు అని కేసీఆర్ అన్నారు. ఆర్టీసీ యూనియన్లు  అర్థం పర్థం లేని విధంగా... దురాశ రహితంగా సమ్మె బాట పట్టారని ఆరోపించారు కెసిఆర్. ఆర్టీసీ  సంస్థను ప్రభుత్వం లో విలీనం చేయాలనే డిమాండ్ తో  ఆర్టీసీ యూనియన్లు సమ్మె చేపట్టారని... ఇలాంటి బ్లాక్మెయిల్ వ్యవహారాలు ఇక మీద భవిష్యత్తులో ఉండకూడదని భావిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది  కుదరని పని అని కేసీఆర్ మరోసారి తేల్చి చెప్పారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ఓ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు  కేసీఆర్. అయితే ఆర్టీసీ లో ప్రైవేటు బస్సులకు  కూడా స్థానం కల్పిస్తే... ఆరోగ్యకరమైన పోటీ ఏర్పడి ఆర్టీసీకి ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 5100 ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు ఇవ్వాలని క్యాబినెట్ లో అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు వివరించారు. 

 

 

 

 అయితే ఆర్టీసీ సంస్థలో  పూర్తిగా పాడయ్యి...  పనికి రాకుండా పోయిన బస్సుల స్థానాల్లో మాత్రమే ఈ ప్రవైట్  బస్సులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అంతేకాకుండా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మరోసారి డెడ్ లైన్ విధించారు ముఖ్యమంత్రి కేసీఆర్.ఈ నెల  5లోపు విధుల్లో చేరాలని సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సూచించారు. అయితే ఇప్పటికే తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించింది ఆర్టీసీ జేఏసీ . ఈ నేపథ్యంలో తాజాగా కాబినెట్ మీటింగ్ తర్వాత కెసిఆర్ వాక్యాలతో ఆర్టీసీ జేఏసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: