విద్యా సంస్కరణల కమిటీ ఏపీ ప్రభుత్వానికి ప్రవేశాలు తక్కువగా ఉన్న 185 ఇంజనీరింగ్ కళాశాలలను, 464 డిగ్రీ కాలేజీలను మూసివేయాలని సిఫార్సు చేసింది. ప్రవేశాలు తక్కువగా ఉన్న కోర్సులను, 50 మంది కంటే తక్కువగా విద్యార్థులు ఉన్న కళాశాలల్ని మూసివేయాలని విద్యా సంస్కరణల కమిటీ ప్రభుత్వానికి సూచించింది. ప్రొఫెసర్ బాలకృష్ణన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఇచ్చిన నివేదికలో రాష్ట్రంలోని   464  డిగ్రీకాలేజీలలో కేవలం 25 శాతం ప్రవేశాలున్నాయని  పేర్కొంది.
 
50 శాతం విద్యార్థులు కూడా చేరని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు 185 ఉన్నాయని కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ ఇంజినీరింగ్ కళాశాలలలో కొన్ని కళాశాలలను మూసివేయవచ్చని కమిటీ నివేదిక ఇచ్చింది. ప్రభుత్వం నుండి ఉపకార వేతనాలు పొందుతున్నప్పటికీ ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో 40 శాతం మంది ఫైనల్ పరీక్షలు రాయటం లేదని కమిటీ నివేదిక ఇచ్చింది. ప్రతి సంవత్సరం ఏపీ ప్రభుత్వం బోధనా రుసుముల కింద రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు 400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. 
 
75 శాతం కంటే ఎక్కువ శాతం హాజరు ఉంటే మాత్రమే బోధన రుసుములు చెల్లించాలని కమిటీ నివేదికలో పేర్కొంది. కమిటీ నివేదికలో విశ్వ విద్యాలయాలు కొత్త కళాశాలల ఏర్పాటుకు ఎటువంటి పరిశీలన చేయకుండానే నిరభ్యంతర పత్రాల్ని ఇస్తున్నాయని కమిటీ పేర్కొంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 73 శాతం మంది ఉత్తీర్ణత సాధిస్తుంటే ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో కేవలం 30 శాతం మంది మాత్రమే ఉత్త్రీర్ణత సాధించటం గమనార్హం. 
 
ఏపీ రాష్ట్ర వర్సిటీల చట్టాన్ని సవరించాలని రుసుములు , ప్రవేశాలకు సంబంధించి ఒక విధానమంటూ లేదని కమిటీ తన నివేదికలో పేర్కొంది. రియల్ టైం డేటా కేంద్రాన్ని రాష్ట్ర స్థాయి ఉన్నత విద్యలో స్థాపించాలని కమిటీ సిఫార్సు చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో, పరిశ్రమల సహకారంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఇంజినీరింగ్ కళాశాలలను ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. 




మరింత సమాచారం తెలుసుకోండి: