ఆంధ్ర ప్రదేశ్  సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఆంధ్రలో విడతల వారీగా మద్యపాన నిషేదం చేస్తామని ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన  హామీ విషయం అందరికి తెలిసిందే. అందులో భాగంగానే సీఎం అయ్యాక నూతన మద్యం పాలసీని తీసుకొని రావడం జరిగింది. సర్కారే మద్యం షాపులను నిర్వహిస్తోంది. బెల్టు షాపులను ఎత్తివేయడం జరిగింది. పర్మిట్ రూంలు కూడా రద్దు చేయడం జరిగింది. గతంలో 4380 వైన్స్ షాపులు ఉండగా వాటిని 3500కి పరిమితం చేసింది జగన్ సర్కార్. అదే విధంగా వైన్స్ షాపుల సమయాన్ని కూడా ఉదయం 11 గంటల నుంచి 8 గంటలకు వరుకు సమయాన్ని కూడా దక్కించారు.


2018 అక్టోబర్ లో 32,28,366 కేసుల లిక్కర్ ను అమ్మగా 2019 అక్టోబర్ లో 23,60,089 కేసుల లిక్కర్ ను మాత్రమే అమ్మారు. అంటే దాదాపు 27 శాతం అమ్మకాలు తగ్గాయి. 2018 అక్టోబర్ లో 23,86,397 కేసుల బీర్లు అమ్మగా 2019 అక్టోబర్ లో 10,40,539 కేసుల బీర్లు మాత్రమే అమ్మడం జరిగింది. దాదాపు 56.4 శాతం అమ్మకాలు తగ్గాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. 


ముఖ్యంగా బెల్ట్ షాపులు రద్దు చేయడం, సమయాన్ని కుదించడం బాగా కలిసి వచ్చింది జగన్ సర్కారుకి. అదే విధంగా ఎక్సైజ్ శాఖ, పోలీసు శాఖ వారు సమన్వయంతో ముందుకు పోవడంతో నకిలీ మద్యాన్ని అడ్డుకోవడం. ఇతర ప్రాంతాల నుంచి మద్యం దిగుమతి కాకుండా చేయడం చేశారు.


సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామన్న సీఎం జగన్ నూతన మద్యం పాలసీతో విజయం సాధించారని దీని ప్రకారం చూస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం సులభమే అని అంతటా చర్చలు కొనసాగుతున్నాయి. ఇక ఈ నిర్ణయం వల్ల మందుబాబులకు పెద్ద చిక్కే ఎదురయింది


మరింత సమాచారం తెలుసుకోండి: