కొంతమంది మగవారు నిత్యం తాగడం వారికి పెద్ద వ్యసనం. నిజం చెప్పాలంటే వారివారి కుటుంబ పరిస్థితులో లేకో ఇంకో కారణం చేతనో ముందుకు బానిసగా మారడం మనం చూస్తుంటాము. ఇదే కోవలోకి కడప జిల్లా బద్వేలుకు చెందిన ఆంజనేయులు పరిస్థితి కూడా ఇదే. కానీ కలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా... ఇంకా అసలు విషయానికి వస్తే...


నిత్యం తాగొచ్చి వేధిస్తున్న భర్తను మహిళ తన కుమారులతో కలిసి రోకలి బండతో కొట్టి చంపేసిన ఘటన కడప జిల్లా బద్వేలు పట్టణంలో జరిగింది. బద్వేలు పట్టణానికి చెందిన ఆంజనేయులు(45) కి భార్య నాగలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. బేల్దారిగా పని చేసే ఆంజనేయులు వచ్చిన సంపాదనంతా మద్యానికే ఉపయోగించేవాడు. నిత్యం ఇంటికి తాగొచ్చి భార్య, పిల్లలను అందరిని వేధించడమే పనిగా పెట్టుకున్నాడు ఆ ప్రబుద్దుడు. 


ఈ క్రమంలోనే శనివారం రాత్రి తాగి వచ్చిన ఆంజనేయులు భార్యతో గొడవ పెట్టుకుని గొడవపడ్డారు. భార్యతో పాటు పిల్లలపైనా రాళ్లు, కత్తితో దాడికి పాల్పడ్డాడు, దీనితో భర్తను ప్రతిఘటించిన నాగలక్ష్మి రోకలి బండతో అతడి తలపై బలంగా కొట్టింది. అంతే తీవ్ర రక్తస్రావంతో ఆంజనేయులు అక్కడే స్పృహతప్పి పడిపోయాడు. దీనితో కుటుంబసభ్యులు 108 సాయంతో బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆదివారం ఉదయం అతడి పరిస్థితి విషమించడంతో కడప రిమ్స్‌ తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచాడు. దీనితో మృతుడి భార్య నాగలక్ష్మి, ఇద్దరు కుమారులు పోలీస్‌ స్టేషన్లో లొంగిపోయారు.


ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మద్యం వినియోగం రోజు రోజుకి తగ్గించాలని ప్రయస్తుంటి ఏదో ఒక మూలాన ఇలాంటి సంఘటనలతో రాష్ట్ర అధికారుల ఆలోచనల, శ్రమను బూడిదపాలు చేస్తున్నారు కొందరు ప్రభుద్దులు. చూద్దాం జగన్ సర్కార్ ఎంతవరకు వీటిని అదుపు చేయగలదో...


మరింత సమాచారం తెలుసుకోండి: