లాంగ్ మార్చ్ కోసం అన్ని సిద్ధం అయ్యాయి.  పవన్ కళ్యాణ్ ఇప్పటికే విశాఖ చేసుకున్నారు.  ఇసుక కొరత కోసమే ఈ లాంగ్ మార్చ్ ను నిర్వహిస్తున్నారు.  ఈ లాంగ్ మార్చ్ లో పవన్ కళ్యాణ్ తో పాటుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు కూడా పాల్గొంటున్నారు.  వీరంతా కలిసి విశాఖలోని మద్దిలపాలెం లో ఉన్న తెలుగుతల్లి విగ్రహం నుంచి బయలుదేరి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా మార్చ్ చేయబోతున్నారు.  


విశాఖ ఉమెన్ కాలేజీ ఎదురుగుగా బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు.  ఈ లాంగ్ మార్చ్ ముఖ్య ఉద్దేశ్యం ఇసుక కొరతకు సంబంధించిన విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే.  అసలు ఇసుక కొరతకు లాంగ్ మార్చ్ చేయడమే పరిష్కారమా అంటే కాకపోవొచ్చు.  ప్రభుత్వం దృష్టికి సమస్యను బలంగా తీసుకెళ్ళాలి అంటే..ఏదో ఒక బలమైన మాధ్యమం ద్వారా మాత్రమే తీసుకెళ్లగలుగుతారు.  


మాములుగా రాజకీయపార్టీలు ధర్నాలు చేస్తుంటాయి.  దీక్షలు చేస్తుంటాయి.  కానీ, పవన్ కళ్యాణ్ ఇందుకు విరుద్ధంగా, అందరికంటే భిన్నంగా అలోచించి ఇలాంటి మార్గాలు ఎంచుకుంటున్నారు.  లాంగ్ మార్చ్ చేయడం వలన ప్రజలంతా కలిసి వస్తారు.  తనతో పాటు అడుగులు వేస్తారు.  లాంగ్ మార్చ్ అన్నది ఇప్పటిది కాదు.  ఒకరకంగా చెప్పాలి అంటే విదేశాల్లో ఎక్కువగా ప్రభుత్వానికి ప్రజలు ఇలాంటి మార్చ్ ద్వారానే నిరసనలు తెలియజేస్తుంటారు.  


ఇప్పుడు పవన్ కూడా ఈ లాంగ్ మార్చ్ ద్వారానే నిరసనలు చేస్తున్నారు.  ఈ నిరసనల ద్వారా ప్రభుత్వానికి సమస్యను గట్టిగా తెలియజేయాలని పవన్ సంకల్పించారు.  ఈ లాంగ్ మార్చ్ విజయవంతమైతే... దీనిని బేస్ చేసుకొని ప్రజల్లోకి మరింత ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారు.  ఈరోజు జరిగే ఈ సభలో తెలుసుదేశం పార్టీ నాయకులు సైతం పాల్గొనడం విశేషం.  ఇది శుభపరిణామం అని చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: