టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది... చేతిలో ఇమిడిపోయే సెల్ ఫోన్ అందుబాటులో ఉండటంతో... నిత్యం ఏవో వస్తువులు కొనుగోలు చేస్తూనే ఉన్నారు.  అలా కొనే ప్రతి వస్తువును కావాల్సిన విధంగా వినియోగించుకుంటూ ఉంటారు. వాడుకొని పాడైపోయిన వస్తువులను ఎక్కడో మూలాన పడేయడమే.. లేదంటే స్టోర్ రూమ్ లో వేయడమో లేదంటే బయట పడేయడమో చేస్తుంటారు..  బయట పడేయడం వలన వానకు తడిసి నాని, కుళ్ళి దోమలు వస్తుంటాయి.  ఆ దోమలు మనుషుల్ని కొట్టడంతో రోగాలు వస్తుంటాయి.  


పైగా బయట పడేయడం వలన రోడ్డుపై వాసన వస్తుంది.  దీని నుంచి బయటపడేందుకు జీహెచ్ఎంసి నూతనంగా ఓ ఆలోచన చేసింది.  జీహెచ్ఎంసి నగరంలో రోజుకో ఏరియా నుంచి పరుపులు, చెక్కలు, ఇతర వస్తువులను సేకరిస్తుంది.  జీహెచ్ఎంసి ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్దకు వెళ్లి ఇంట్లో నిరూపయోగంగా ఉన్న వాటిని వాళ్లకు ఇచ్చేవచ్చు.  


నగరంలో  ఈరోజు నుంచి పదిరోజులపాటు ఈ డ్రైవ్ ను నిర్వహిస్తున్నారు. ప్రతి డివిజన్ లో మూడు లేదా నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసి, నిరుపయోగంగా ఉన్న వస్తువులను సేకరిస్తోంది.  ప్రతి డివిజన్‌లోనూ కొన్ని ప్రదేశాలను ఎంపిక చేసి ఏ రోజు ఎక్కడ సేకరించాలో కూడా నిర్ణయించారు. ఇవాళ నగరంలోని పలు ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఫర్నీచర్, తదితర వస్తువులను జీహెచ్‌ఎంసీ కార్మికులు సేకరించారు.  


పదిరోజుల పాటు ఈ కేంద్రాలు పనిచేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు దీనిని సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్ఎంసి కోరుతున్నది.  ప్రతి ఒక్కరికి ఈ పధకం ఉపయోగపడుతుంది.  ఇంట్లో ఉన్న వస్తువులను ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా జీహెచ్ఎంసి వాళ్లకు ఇచ్చేయవచ్చు.  రీసైక్లథాన్ హైదరాబాద్ పేరిట జీహెచ్‌ఎంసీ శ్రీకారం  చుట్టిన ఈ కార్యక్రమానికి నగరవాసుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.  మరో పదిరోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: