ఉద్యోగాల కోసం దళారీలను, డబ్బు కట్టించుకుని ఏజెంట్లను నమ్మవద్దంటూ ఎంత ప్రచారం చేసిన ఎవరో ఒకరు   ఇలాంటి కేటు గాళ్ళ వలలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పుణ్య క్షేత్రం తిరుపతి. టీటీడీ లో ఉద్యోగం చేయాలనీ...చాల మంది ఆశపడుతూ ఉంటారు. ఇటువంటి వారి ఆశలను అవకాశంగా మార్చుకొని.... అమాయకులను మోసం చేసేందుకు ప్లాన్ చేసారు కొందరు యువకులు.


డబ్బుకి కకృత్తి పడి చివరికి దేవుడి పేరు వాడుకున్నారు ఆ యువకులు.  దేవుడి పేరుతో పంగ నామం పెట్టాలనుకున్న వీళ్ళని చివరికి పోలీసులు పట్టుకున్నారు. టీటీడీలో ఉద్యోగాలిస్తామంటూ..భారీగా వసూళ్లకు మహేష్ అనే వక్తి ఒక ముఠా ని తయారు చేసాడు.
ఐదుగురు వ్యక్తులు కలిసి ఓ ముఠాగా ఏర్పడి నిరుద్యోగుల నుంచి లక్షలకు లక్షలు వసూలు చేశారు.


తిరుపతి టీచర్స్ కాలనీకి చెందిన మహేష్..లుక్‌ మీ మ్యాన్‌పవర్ పేరుతో టీటీడీ లడ్డూ కౌంటర్‌ ఏజెన్సీని తీసుకున్నాడు. తన స్నేహితులతో కలిసి ఈజీ మనీ సంపాదించేందుకు ఓ ప్లాన్ వేశాడు.  టీటీడీకి చెందిన లడ్డూ కౌంటర్లతోపాటు, అన్నప్రసాదంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 30 మంది నుంచి డబ్బులు వసూలు చేశారు.గోపీ అనే వ్యక్తికి అన్నప్రసాదంలో సూపర్‌వైజర్‌గా జాబ్ ఇస్తామంటూ 57 వేలు తీసుకున్నారు.


దాంతో కొందరు నిరుద్యోగులు ఈ ముఠాకు భారీగా డబ్బు ముట్టజెప్పారు. తీరా డబ్బు చెల్లించి రోజులు గడుస్తున్నా ఉద్యోగాలు మాత్రం రాలేదు.ఒక వ్యక్తికి సూపర్‌వైజర్ కాకుండా క్లీనింగ్ డిపార్ట్‌మెంట్‌లో జాబ్‌ ఇచ్చారు. దీంతో బాధితుడి తో పాటు మిగిలిన వారు  పోలీసులను ఆశ్రయించాడు.  ఐదుగురు సభ్యుల ముఠాపై నిఘా పెట్టిన పోలీసులు... పక్కా ఆధారాలతో నలుగురిని అరెస్ట్ చేశారు. అయితే ప్రధాన నిందితుడు మహేష్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు.. అతడిని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: