పార్టీని నడపటం అంటే ఆషామాషీ అనుకుంటున్నారా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎదురు ప్రశ్నించడం గమనార్హం. నేను పార్టీ పెట్టి ఒక భావజాలంతో ముందుకు వెళ్తున్న పార్టీ కోసం ప్రాణాలిస్తా మీరు ఇవ్వగలరా అని సవాల్ విసిరారు. ఎవడికి దమ్ముంది ఎవడికి దమ్ము లేదు ఒక పార్టీ పెట్టి మాట్లాడండని అన్నారు. ఆదివారం విశాఖపట్నంలో ఇసుక సమస్యపై జరిగిన లాంగ్ మార్చ్ వేదికపై పవన్ స్టార్ పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పారని చెప్పాలి. అపశృతులు, ఆటంకాల నడుమ జరిగిందనిపించుకున్న పవర్ స్టార్ మాట్లాడుతూ..ఓడిపోయామని చులకనగా మాట్లాడుతున్నారా నిలదీశారు. ఓటమి - గెలుపు కావు పోరాటమే ముఖ్యం మాకు అని స్పష్టం చేశారు. 



అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు కూడా కాలేదు.. అప్పుడే సమస్యలతో రోడ్డు మీదికి రావాల్సి పరిస్థితి ఏర్పడిందని వైఎస్సార్ సీపీని పవన్ ఎద్దేవా చేశారు. నన్ను విమర్శించే నాయకుల్లాగా నా దగ్గర వేల కోట్లు లేవు.. వేల ఎకరాలు లేవని వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులకు సభాముఖంగా చెబుతున్న జగన్ అద్భుత పాలన అందిస్తే నేనెళ్లి సినిమాలు తీసుకుంటానని స్పష్టం చేశారు. భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులను ప్రభుత్వానికి చాటి చెప్పే లక్ష్యంతో జనసేన తలపెట్టిన ‘లాంగ్ మార్చ్‌’లో ఆ పార్టీ అధినేత పవన్ ప్రసంగించారు. జగన్ అద్భుత పాలన అందిస్తే తాను వెళ్లి సినిమాలు తీసుకుంటానని జనసేనాని వ్యాఖ్యానించారు.




అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డే కాదు. సగటు రాజకీయ నాయకులు నిజంగా ప్రజల పట్ల బాధ్యతగా ఉండుంటే తనకు జనసేన పార్టీ పెట్టాల్సిన అవసరం ఉండేదే కాదని అన్నారు. తనకు రాజకీయాలు సరదా కాదని, ఏదో నాలుగు పుస్తకాలు చదువుకుని ఇంట్లో కూర్చునేవాడినని.. సినిమాల్లోకి కూడా పొరపాటున వచ్చానని ఆయన చెప్పుకొచ్చారు. సగటు రాజకీయ నాయకుల పాలసీలు, విధివిధానాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నప్పుడు సామాన్యుల నుంచే నాయకులు పుడతారని.. అలాగే తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: