జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకుంటారు. తానో మేథావిగా భావిస్తుంటారు. అలాంటి పవన్ ఓ మహత్తర కార్యక్రమాన్ని అభాసుపాలు చేశారన్న విమర్శలు వస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఇసుక కార్మికులు, భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై నిరసనగా ఆయన ఈ కార్యక్రమం నిర్వహించారు.


పవన్ ఈ కార్యక్రమం చేపట్టడంతో లాంగ్ మార్చ్ అనే పదం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ లాంగ్ మార్చ్ చైనాలో 1934 లో జరిగింది. అప్పట్లో అధికారం కోసం చైనా కమ్యూనిస్ట్ ప్రజా విమోచన సైన్యం మావో నాయకత్వంలో 10 వేల కిలోమీటర్లు నడిచింది. ఈ లాంగ్ మార్చ్ ఆ పార్టీకి అధికారం సాధించిపెట్టింది. ఈ లాంగ్ మార్చ్ చైనా రాజకీయాలను కీలక మలుపు తిప్పింది. ఈ లాంగ్ మార్చ్ కార్యక్రమానికి అంతటి ప్రాధాన్యత ఉంది.


కానీ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆ పదాన్ని అపహాస్యం చేశారన్న విమర్శలు వస్తున్నాయి.. చైనా నాయకులు పది వేల కిలోమీటర్లు నడిస్తే పవన్ కల్యాణ్ కనీసం పది కిలోమీటర్లు కూడా నడవలేకపోయారు. ఇప్పుడు ఇదే విషయాన్ని వైసీపీ నేతలు తమ విమర్శల్లో ప్రస్తావిస్తున్నారు.


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ పేరు పెట్టుకుని కనీసం రెండు కిలోమీటర్లు నడవేలేకపోయారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అనకాపల్లి ఎమ్మల్యే గుడివాడ అమరనాద్ విమర్శించారు.పవన్ కల్యాణ్ చేసింది లాంగ్ మార్చ్ కాదని, వెహికల్ మార్చ్ చేశారన్నారు. శాండ్ మాఫియా, డ్రగ్ మాఫియా నేతలను పక్కన పెట్టుకుని పవన్ మాట్లాడారని ఎద్దేవా చేశారు. ఇసుక సమస్యను పరిష్కరించడం కోసం వైసీపీకి గడువు ఇవ్వడానికి పవన్ ఎవరని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ పై ద్వేషం, ఈర్ష్యతో పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ నదుల చెంత లాంగ్ మార్చ్ చేస్తే విషయం తెలిసేదని ఆయన అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: