ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకొని అమలు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. అనాధ సంరక్షణ కేంద్రాల్లో మగ్గుతున్న చిన్నారుల కోసం జువైనల్ జస్టిస్ చట్టంలో పేర్కొన్న విధంగా ఫోస్టర్ కేర్ విధానం అమలు చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను www.wdcw.ap.gov.in వెబ్ సైట్ లో పూర్తి వివరాలు లభిస్తాయి.


ఫోస్టర్ కేర్ విధానం అంటే తల్లిదండ్రులు లేక అనాధాశ్రమాల్లో, ప్రభుత్వ ఆశ్రమాల్లో నివసిస్తున్న చిన్నారులను కొంత కాలం వరకు ఇంటికి తెచ్చుకొని పెంచుకోవచ్చు. ఈ విధానాన్నే ఫోస్టర్ కేర్ విధానం అంటారు. వారి వారి ఆర్ధిక స్థోమతను బట్టి నచ్చినన్ని రోజులు చిన్నారులను పెంచుకునే అవకాశం కలిపిస్తుంది. ఆ తర్వాత చిన్నారులను తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలి. ఒకవేళ పిల్లలు పెంచుకున్న వారి దగ్గరే ఉంటామంటే నియమ నిబంధనల ప్రకారం దత్తత తీసుకునే అంశాన్ని ప్రభుత్వం పరిశీలన కచ్చితంగా చేస్తుంది. ఈ విధానం పిల్లలు లేని వారికి ఉపయోగపడుతుంది.  అనేక మంది పిల్లలు నిత్యం ఏదో రకంగా రోడ్ల మీద కనిపిస్తుంటారు.

కొంత మంది తల్లితండ్రులు ఆడపిల్లలని చెత్త కుప్పల దగ్గర వేయడం రోడ్ల మీద వేయడం జరుగుతుంది. ఇలా అనేక మందిని సర్కార్ చేరదీసి బాలసదన్ లలో, అనాథాశ్రమల్లో పెంచుతుంది. వారికి తల్లితండ్రులు ఎలా ఉంటారో, వారి ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలియదు. అటువంటి పిల్లలకు దైర్యమిచ్చేలా ఈ ఫోస్టర్ విధానం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 


ఫోస్టర్ విధానం పై ఈ నెల 23 వరకు  ఏపీ సర్కార్ సలహాలు సూచనలు స్వీకరిస్తుంది. వెబ్ సైట్ ద్వారా మీ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి చెప్పవచ్చు. ప్రస్తుతవ ఫోస్టర్ కేర్ విధానం విదేశాల్లో అమలవుతుంది. మన దేశంలో కూడా కేరళలో అమలవుతుంది. దీని ద్వారా అనాధ పిల్లలకు తల్లితండ్రులు లేని లోటు ఉండదు. దీని పై ఇప్పటికే సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారని తెలుస్తోంది. ఏపీ సర్కార్ త్వరలో దీని పై అధికారిక ప్రకటన చేయనుంది. ఏపీ సర్కార్ తీసుకోబోతున్న ఈ నిర్ణయం పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: