తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రి మండలి సమావేశానంతరం మీడియాతో  మాట్లాడుతూ.. ఆర్టీసి ఉద్యోగులు సమ్మె విరమించి నవంబర్ 5 లోపు డ్యూటీ లో చేరకపోతే వారిని శాశ్వతం గా విధులనుంచి తొలగమిస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. చాలా మంది ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ, ఆర్టీసి ని రాష్ట్ర ప్రభుత్వంలో కలపడం ఏ మాత్రం కుదరదని కెసిఆర్ బలగుద్ది చెప్పారు. యూనియన్ నాయకుల మాటలను నమ్మకుండా ఇచ్చిన గడువు లోపు డ్యూటీ లో చేరాలని ఎందుకంటే అదే తాను ఇస్తున్న చివరి అవకాశం అని చెప్పారు.


దీనితో జగిత్యాల ఆర్టీసి ఉద్యోగులు మళ్ళీ క్రమక్రమంగా తమ తమ విధులలోకి చేరుతున్నారు. ఇప్పటికే జగిత్యాల జిల్లా మెట్‌పల్లి డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్న ఎండీ ఖదీర్, స్టాఫ్ నెంబర్. 322544, తాను సమ్మె విరమించి మళ్ళీ విధులలోకి చేరుతున్నా అని డీవీఎం నాగేశ్వర్ కు రాసిన దరఖాస్తులో పేర్కొన్నారు. కోరుట్ల ఆర్టీసీ లో మెకానికల్ ఫోర్ మెన్ ఉద్యోగిని గా విధులు నిర్వహిస్తున్న యం. సంధ్యారాణి 322902 తాను కూడా సమ్మె విరమించుకొని డ్యూటీ లో జాయిన్ అవుతున్నట్లు లేకపూర్వితంగా తనపై అధికారులకు తెలియజేసింది.


రేపటితో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసి ఉద్యోగులు సమ్మె విరమించి డ్యూటీలో జాయిన్ అవుతారా లేదా? అనే విషయం తేలాలంటే మనం మంగళవారం రాత్రి వరకు వేచి ఉండాల్సిందే. ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే 49, 000 ఆర్టీసి ఉద్యోగులు విరామం లేకుండా ధర్నాలు చేస్తూనే ఉన్నారు.

కెసిఆర్ ఆర్టీసీ ఉద్యోగుల్ని తన పిల్లలు లాగా చూసుకొనేదిపోయి వాళ్ళని బెదిరిస్తున్నాడని, జెఏసి అధ్యక్షుడు అశ్వథామ రెడ్డి  మీడియా తో అన్నారు. కెసిఆర్ నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేసిన అశ్వథామ రెడ్డి, హోమ్ మినిస్టర్ని కలుస్తామని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: