రైతులు ధాన్యాలను రోడ్లపై పోస్తూ  ఉంటారు. అయితే రైతులు ధాన్యాలను రోడ్లపై పోయడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. రైతులు తమ తమ ధాన్యాలను రోడ్లపైకి పోస్తే  జరిమానా విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తునప్పటికీ రైతులు మాత్రం అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అలాగే రోడ్ల పైన ధాన్యం పోస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో  ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. అయితే తాజాగా రైతులు రోడ్డుపై ధాన్యం పోసిన కారణంగా ఓ స్కూల్ బస్సు బోల్తా పడింది. చిత్తూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 



 చిత్తూరు జిల్లా యాదమరి మండలం బుడితిరెడ్డిపల్లి లో స్కూల్ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. కాగా బస్సు ప్రమాదం జరిగిన సమయంలో ఆ బస్సులో 27 మంది చిన్నారులు  ఉన్నారు. కాగా  బస్సులో ఉన్న 27 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. అయితే గాయపడిన విద్యార్థులను హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని అధికారులు డాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ప్రమాదం జరగడంతో బస్సులో ఉన్న 27 మంది విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. 



 కాగా  తెల్లవారుజామున బస్సు బయలుదేరడం తో రోడ్డుపై ఎక్కువ పొగమంచు కూరుకుపోవడంతో డ్రైవర్ కు  రోడ్డు కనపడకపోవడం వల్లే  బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది అంటూ స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా బస్సు ప్రమాదం జరగడానికి కారణం అక్కడ రోడ్డుపై రైతులు ధాన్యాన్ని పోవడం కూడా ఒక కారణం అంటూ అధికారులు చెబుతున్నారు. ఆ రోడ్డు గుండా దాన్యం పోయడం వల్ల ఇప్పటికే ఎంతోమంది రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు సైతం   కోల్పోయిన సంఘటనలు ఉన్నాయని... ఆర్డిఓ తెలిపారు. అయితే రైతులను రోడ్లపై ధాన్యం ఎండబెట్టవద్దంటూ ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా రైతులు వినకుండా అలాగే చేస్తారని దీంతో ఎంతో మంది ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు తెలిపారు. అయితే 27 మంది చిన్నారులతో బయలుదేరిన స్కూల్ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడడంతో అందరికీ తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చిన్నారుల  కుటుంబాల్లో ఒక్కసారిగా అలజడి నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: