ప్రపంచంలో అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల్లో చైనా,  జపాన్, దక్షిణ కొరియా ముందు ఉన్నాయి.  ఇండియా కన్నా ముందు ఉన్నాయి.  కానీ, ఇండియా లేకుంటే చైనా ఉత్పత్తులకు మార్కెట్ లేదు. ఇండియా వద్దు అనుకుంటే చైనా ఆర్ధిక వ్యవస్థపై చాలా పెద్ద దెబ్బ పడుతుంది.  చైనాలో తయారయ్యే వస్తువుల్లో ఎక్కువగా భాగం ఇండియాకు దిగుమతి అవుతుంటాయి.  ఇప్పుడు ఆర్సీఈపీలో ఇండియా భాగస్వామ్యమైతే.. చైనా నుంచి కారుచౌకగా ఉత్పత్తులు ఇండియాలోకి వచ్చేస్తాయి.  సుంకాలు 90శాతం వరకు తగ్గిపోతుంది.  ఫలితంగా ఇండియాలో చైనా వస్తువులే కనిపిస్తాయి.  


ఇది ఇండియాలోని వ్యాపార రంగానికి పెద్ద దెబ్బ.  ఇండియా నుంచి కూడా ఆర్సీఈపి సభ్య దేశాలకు వస్తువులను సరఫరా చెయ్యొచ్చు.  కానీ, చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువగా ఉంటుంది.  అందుకే ఈ విషయంలో ఇండియా అలోచించి అడుగు వేసింది.  ఒక్క చైనా నుంచే కాదు... ఈ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న 10 ఆసియా దేశాలు, చైనా, దక్షిణ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల నుంచి కూడా వస్తువులు తక్కువ ధరకు ఇండియాలోకి వచ్చేస్తాయి.  


చైనా భాగస్వామ్యం లేకుంటే.. ఇండియా తప్పకుండా ఈ ఆర్సిఈపీ లో జాయిన్ అయ్యి ఉండేది.  కానీ, చైనా ఉండటమే వలనే ఇండియా ఆ గ్రూప్ లో జాయిన్ కాలేదు.  ఇండియా ఈ ఆర్ధిక విధానంపై కొన్ని అభ్యంతరాలు తెలిపింది.  దీంతో ఇండియా అభ్యంతరాలు తెలపడంతో మరలా సమావేశాలు వచ్చే ఏడాదికి వాయిదా పడే విధంగా ఉన్నది.  ఇండియా జాయిన్ అయితేనే చాలా దేశాలు ఆ కూటమితో కలిసేందుకు సిద్ధంగా ఉన్నాయి.  


ఇండియా కాదు అంటే ఆయా దేశాలు కూడా వెనకడుగు వేస్తున్నాయి.  కారణం ఏమంటే.. ఇండియా అతిపెద్ద మార్కెట్.  ఇండియాలో మార్కెట్ చేసుకోగలిగితే చాలు.. భారీ ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు.  ఇండియాకు ఎగుమతులు దండిగా చేసుకోవచ్చు.  దిగుమతులు అధికమై.. ఇతరదేశాలపై ఆధారపడితే.. ఫలితంగా ఇండియాలోని చిన్న చిన్న వ్యాపారులు దెబ్బతింటారు.  అందుకే ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: