రాష్ట్ర విభజన అనంతరం  రెవెన్యూ చట్టం లో ముఖ్యమంత్రి  కేసీఆర్ తీసుకువచ్చిన  మార్పులు రైతులకు ,అధికారులకు ఇబ్బందిగా మారాయని  కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు జగ్గారెడ్డి అన్నారు  . తెలంగాణ రెవెన్యూ చట్టం , రైతులకు ,అధికారులకు వెసులుబాటుగా ఉండేదని అన్నారు . నమస్తే తెలంగాణ దినపత్రికలో ..ధర్మగంట శీర్షిక పేరుతో ప్రచురించిన కథనాలు  రైతులు ,అధికారులకు మధ్య వైరాన్ని పెంచిందని చెప్పారు . తహశీల్ధార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనపై జాగారెడ్డి మీడియా తో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ రెవెన్యూ అధికారులపై ధర్మ గంట  ప్రజల్లో విషాన్ని  నూరిపోసిందని అన్నారు.


ధర్మ గంట కారణంగాన్నే ప్రజల్లో  రెవెన్యూ అధికారులపై ద్వేషం పెరిగిందని జగ్గారెడ్డి తెలిపారు . సీఎం రెవెన్యూ డిపార్ట్ మెంట్ పై వ్యవహరించిన తీరే  ఎమ్మార్వో బలికి కారణమైందని జగ్గారెడ్డి పేర్కొన్నారు . లంచాన్ని అరికట్టడం ఏ నాయకునితో సాధ్యం కాదని , ఎమ్మార్వో మృతి ఘటనలో ఉద్యోగ సంఘాల నాయకుల తప్పుందని చెప్పారు . కేసీఆర్  నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల గుడ్డిగా ప్రభుత్వాన్ని సమర్థిస్తూ వస్తున్నది నిజం కాదా ? అంటూ ప్రశ్నించారు . మంత్రులు  శ్రీనివాస్ గౌడ్ , రాజేందర్ , ఉద్యోగ సంఘాల నేతలు రవీందర్ రెడ్డి , మమతలే  ..ఎమ్మార్వో చావుకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు . రైతు ఆవేశానికి ప్రభుత్వం విధానాలు .. ఎమ్మార్వో చావుకు ఉద్యోగ సంఘాలే తీరే కారణమంటూ మండిపడ్డారు .


ప్రభుత్వం ఇకనైనా  మేల్కొవాలని  .. అధికారులు ..ప్రజలకు మధ్య స్నేహపూర్వ   వాతావరణం పెంచాలని సూచించారు . ప్రభుత్వం మేల్కొకోకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని జగ్గారెడ్డి  హెచ్చరించారు . తహశీల్ధార్ ను కార్యాలయం లోనే ఒక ఆగంతకుడు పెట్రోలు పోసి నిప్పంటించి  సజీవ దహనం  చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది . 

మరింత సమాచారం తెలుసుకోండి: