రోడ్డు ఎక్కిన పోలీసులు ,అసాధారణ రీతిలో పోలీసులు రోడ్లపైకి వచ్చారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన ఖాకీలే, తమకు న్యాయం చేయాలంటూ నినదించారు. ఏకంగా పోలీసు ప్రధాన కార్యాలయం ఎదుటే వారి ఆందోళనను వ్యక్తం చేసారు. "వి వాంట్ జస్టిస్ "అంటూ నినాదాలు చేశారు. సీనియర్ అధికారులు తమ వితిధుల్లోకి రావాలని చూపిన పోలీసులుగా పెద్దగా పట్టించుకోలేదు వారి న్యాయం కోసం పోరాటం కోనసాగించారు. పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ స్వయంగా తమ వద్దకు వచ్చి మాట్లాడాలని పట్టుబట్టారు. దేశ రాజధానిలో ఈ ఘటన చోటు చేసుకుంది.


ఢిల్లీలో లాయర్లు, పోలీసులకు ఈ మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తలకు దారి తీస్తుంది.  ఢిల్లీలో మంగళవారం ఉదయం  పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద  పోలీసులు, అధికారులు  ఇద్దరు కలిసి ఆందోళనకు దిగారు. వారికీ తగ్గ న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. శనివారం తీజ్ హజారి కోర్టు, సోమవారం సాకేత్ కోర్టులో జరిగిన ఘర్షణ కారణంగానే నిరసన ప్రదర్శన చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

శనివారం రోజు తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో పార్కింగ్ విషయంలో లాయర్లు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారని న్యాయవాదులు ఆరోపించారు. ఏది ఇలా  ఉండగా అటు పోలీస్ విభాగానికి చెందిన వాహనాలకు దుండగులు నిప్పంటించారు. ఈ ఘర్షణల్లో ఓ లాయర్ తీవ్రంగా  గాయపడగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అలాగే సాకేత్ కోర్టులో ఓ పోలీస్ పై పలువురు లాయర్లు దాడికి పాల్పడ్డారు. ఘర్షణకు పోలీసుల తీరే కారణమంటూ లాయర్లు సోమవారం నిరసన చేపట్టారు. లాయర్ల వల్లే ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఘర్షణ తీవ్రం కావడంతోనే ముందు జాగ్రత్తగా గాల్లోకి కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: