వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను తప్పకుండా ఒక్కొక్కటిగా నిలుపుకుంటూ వస్తున్నాడు.  తాజాగా జగన్ రమణ దీక్షితుల విషయంలో మాటను నిలుపుకున్నాడు.  గత ప్రభుత్వం రమణ దీక్షితులు పక్కన పెట్టింది.  నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం చేపట్టిన విధానాలపై అయన విమర్శలు చేయడంతో తిరుమల ఆలయ విధుల నుంచి తప్పించింది.  ప్రధాన అర్చకత్వం తరతరాల నుంచి వస్తున్నది.  గత ప్రభుత్వం ఈ విధంగా చేయడంతో బాబుపై అప్పట్లో విమర్శలు వచ్చాయి.  


ఇదిలా ఉంటె, జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలోనే రమణ దీక్షితులు తిరిగి ప్రధాన అర్చకుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  అలానే ఆగమన సలహా మండలి సభ్యుడిగా కూడా ఆయన్ను నియమించింది.  అలానే రమణ దీక్షితుల ఇద్దరు కుమారులను గోవిందరాజ ఆలయం నుంచి తిరిగి తిరుమల ఆలయంకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.  


దీంతో రమణ దీక్షితులు ప్రధాన అర్చకుడిగా తిరుమల ఆలయంలోకి ప్రవేశించారు.  తిరుమల ఆలయం అంటే రమణ దీక్షితులు ప్రధాన అర్చకులు అనే పేరు ఎప్పటి నుంచి ఉండిపోయింది.  ఇక గత ప్రభుత్వం హయాంలో టీటీడీలో జరిగిన ఆరాచకాలు, అవినీతిపై రమణదీక్షితులు బహిరంగ ఆరోపణలు చేయడంతో ఆయనను ప్రధాన అర్చకుడి పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా స్వామి వారి అతి పురాతనమైన ఆభరణాలు విదేశాలకు తరలి వెళ్తున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేయడంతో పాటు ఆగమశాస్త్రానికి విరుద్ధంగా శ్రీవారి పోటును మూసివేసి, తవ్వకాలు జరిపారని విమర్శించిన నేపథ్యంలో గత ప్రభుత్వం ఆయన్ను తప్పించింది.  


ఆ సమయంలో రమణ దీక్షితులు వైఎస్ జగన్ ను కలిసి మాట్లాడతారు.  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తప్పకుండా రమణ దీక్షితులను తిరిగి ప్రధాన అర్చకుడిగా నియమిస్తామని చెప్పారు. జగన్ చెప్పిన విధంగానే ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులని నియమించారు.  ఆలయంలోకి తిరిగి రమణ దీక్షితులు ప్రవేశించడంతో.. అక్కడి అర్చకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: