రైతులకు సంబంధించిన భూమి రిజిస్ట్రేషన్ ఆలస్యం కావడం, భూమిపై వివాదం నెలకొనడంతో... అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో విజయారెడ్డి పై పెట్రోల్ పోసి సురేష్ అనే ఆగంతకుడు హత్య చేసిన సంగతి తెలిసిందే.  ఈ హత్యతో రెవిన్యూ ఉద్యోగులు ఒక్కరిగా భగ్గుమన్నారు.  నిరసనలు తెలియజేశారు.  మూడు రోజులపాటు తెలంగాణాలో విధులు బహిష్కరించారు.  ఎమ్మార్వో విజయారెడ్డి హత్య సంచలనం సృష్టించింది.  


రిజిస్ట్రేషన్ ఆలస్యమైతే... ఇలా హత్యలు చేస్తారా అంటూ నిరసనలు తెలియజేశారు.  ఇప్పుడు రెవిన్యూ ఉద్యోగులు ఆఫీస్ కు వెళ్లాలంటే భయపడుతున్నారు.  సమస్యలు తీర్చాలని రైతులు ఆఫీస్ లకు వస్తున్నారు.  భూముల్లో అనేక లిటిగేషన్లు ఉంటున్నాయి.  అవి సాల్వ్ కావడానికి సమయం  పడుతుంది. జాతీయ రహదారి, ఓఅర్ఆర్ కు దగ్గరగా ఉండే భూములకు సంబంధించిన వ్యవహారాలు ఎక్కువగా లిటిగేషన్లో ఉంటున్నాయి.  


పట్టాలు లేకపోవడంతో పట్టా కోసం రైతులు ఆఫీస్ ల చుట్టూ తిరుగుతున్నారు.  మాములుగా ప్రభుత్వ ఆఫీస్ లలో ఇలాంటి విషయాలు ఆలస్యం అవుతూనే ఉంటాయి.  అయితే, విజయారెడ్డి హత్య తరువాత ఉద్యోగుల్లో ఒకంత భయం కనిపిస్తోంది.  కార్యాలయానికి వచ్చే రైతుల సమస్యలు త్వరగా తీర్చాలని అనుకుంటున్నారు.  ఈ భయం ఒక్క తెలంగాణలోనే కాదు, ఏపీలోనూ రెవిన్యూ అధికారులు భయపడుతున్నారు.  


ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలోని పత్తికొండ ఎమ్మార్వో ఉమామహేశ్వరి తనను తాను రక్షించుకోవడానికి ఆఫీస్ లో ఓ వినూత్న ప్రయాగం చేసింది.  ఆఫీస్ లో తన చాంబర్ దగ్గర తాడు కట్టింది.  అర్జీలు పెట్టుకోవడానికి, సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే ప్రజలు ఆ తాడు అవతల ఉండి విషయాలు చెప్పాలని, అర్జీలు ఏవైనా ఉంటె తాడు బయట ఉండే ఇవ్వాలని షరతులు పెట్టింది.  ఆ కార్యాలయానికి వచ్చిన వ్యక్తులు ఆ తాడు చూసి షాక్ అవుతున్నారు.  చేసేది లేక బయట ఉండే సమస్యలు చెప్పి వెళ్లిపోతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: