తెలంగాణలో అబ్దుల్లాపూర్‌మెట్ ఘటనను ఇంకా మర్చిపోక ముందే ..ఆంధ్ర ప్రదేశ్ లో ఓ రైతు ఏకంగా తహశీల్దార్ కార్యాలయంలోనే ఆత్మహత్యాయత్నం చేయడం పెద్ద కలకలం రేపింది. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలోని కొండాపురంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారడం జరిగింది. దత్తాపురంకు చెందిన బుడిగ ఆదినారాయణ తన భూమికి సంబంధించి సమస్యపై ఎమ్మార్వో ఆఫీసుకు పోవడం జరిగింది.

తన వెంట తెచ్చుకున్న పెట్రోలు ఒంటిపై పోసుకొని నిప్పటించుకునే ప్రయత్నం చేశాడు అంటే నమ్మండి. వెంటనే చుట్టు పక్కల ఉన్న జనాలు అడ్డుకొని ఆపారు.. అతడ్ని బయటకు తీసుకొచ్చి నీళ్లు పోయడంతో ప్రమాదం నుంచి బయట పడ్డాడు. తన భూమికి సంబంధించిన సమస్యపై ఎమ్మార్వోను కలిసినా ఫలితం లేకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు అక్కడ ఉన్న  బాధితుడు  తెలియ చేస్తున్నాడు.


కొండాపురం మండలంలోని బుక్కపట్నంలో ఆదినారాయణ కుటుంబానికి 122 సర్వేనంబర్‌లో 10.94 ఎకరాల డీకేటీ భూమి అతనికి ఉంది. ఈ భూమిలో 3.50 ఎకరాలు అదే గ్రామానికి చెందిన నరసింహ అనే వ్యక్తి గండికోట ప్రాజెక్టు కింద ముంపు పరిహారం అందుకోవడం జరిగింది. ఇక మిగిలిన భూమిపై చాలా ఏళ్లగా వివాదం జరుగుతూనే వస్తుంది. ఈ భూమిలో 3.5 ఎకరాలు తన తండ్రి పేరు మీద ఉందని దానిని తన తల్లి పేరుకు మార్చాలని అధికారుల్ని కలిసి వినతిపత్రం కూడా అందచేసాడు.. కోర్టును కూడా ఆశ్రయించాడు. 1989 నుంచి ఆ భూమి తన తండ్రి పేరుపై ఉందని చెబుతున్నాడు. తన సమస్యపై ఎమ్మార్వో స్పందించకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఇదిలా ఉండగా  ఈ భూమికి సంబంధించిన కేసు కోర్టులో ఉందని తహశీల్దార్‌ వెల్లడిస్తున్నారు. అది డీకేటీ భూమి అని.. ఆ భూమికి ఆదినారాయణ నకిలీ పాసు పుస్తకం తయారు చేసుకున్నాడు అని తహశీల్దార్‌  తెలిపారు. ఆ పొలంపై ఆదినారాయణకు ఎలాంటి హక్కులు లేకున్నా అధికారులను బెదిరిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు తెలియచేస్తున్నారు. అందుకే ఆ భూమిని ఆన్‌లైన్ చేయలేదని వివరణ కూడా ఇవ్వడం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: