భార్య భర్తల మధ్య ప్రేమ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కొందరు తమ భార్యలను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటారు.  ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటారు.  పెళ్లి అయ్యి ఎన్ని సంవత్సరాలు అయినా సరే వారిని ప్రేమ తగ్గదు.. పైగా నిత్యం తమతోనే ఉండి.. కష్టంలో, సుఖంలో అన్ని రకాలుగా ఆడుకుంటారు కాబట్టి. ప్రేమ మరింతగా పెరుగుతుంది తప్పించి తగ్గదు.  


భార్యను ఉన్నతంగా ప్రేమించే భర్తలు చాలా అరుదుగా ఉంటారు.  వారు నిత్యం వారి భార్య కోసం కష్టపడుతూనే ఉంటారు.  అలాంటి వ్యక్తుల్లో ఒకరు లండన్ లో ఉన్నారు.  మాములుగా విదేశీయులకు ప్రేమ, ఆప్యాయతలు అన్నవి తక్కువుగా ఉంటాయని అనే అభిప్రాయం ఉంటుంది.  కానీ, ఆ అభిప్రాయం తప్పని నిరూపించాడు లండన్ కు చెందిన ఓ వ్యక్తి.  తనకు 20 సంవత్సరాల క్రితం పెళ్ళి జరిగింది.  


పెళ్ళైనప్పటి నుంచి తన భార్యను ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాడు.  భార్య కోసం ఎన్నో చేశాడు.  ఇతనికి ఇప్పుడు ఐదుగురు సంతానం.  అంతా హ్యాపీగా ఉన్నది. ఇప్పటికే ఐదుగురును కన్నాను... ఇంకా నా వల్లకాదు అన్ని భార్య చెప్పడంతో భార్యను కష్టపెట్టడం ఇష్టం లేక.. అతను వేసక్టమీ చేయించుకోవాలని అనుకున్నాడు.  వేసక్టమీ తరువాత అతని వీర్యం వృధా అవుతుంది.  అందుకే చివరి వీర్యంతో భార్యకు గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకున్నాడు.  


అతనికి ఓ ఆలోచన వచ్చింది.  వీర్యంతో ఉంగరం చేయించాలని అనుకున్నాడు.  దానికోసం అన్ని సిద్ధం చేసుకున్నాడు.  వీర్యాన్ని డిమాండ్ వంటి ఒక చిన్న గాజు గోళంలో తీసుకొని దానితో ఉంగరం తయారు చేయించాడు.  ఆ ఉంగరాన్ని తన భార్యకు గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాడు.  చాలా ఆనందంగా ఉందని అంటున్నాడు సదరు వ్యక్తి.  తనకోసం ఆమె ఎంతగానో కష్టపడిందని, దానికి ప్రతిఫలంగా ఆమెకు ఇలాంటి గిఫ్ట్ ఇవ్వడం హ్యాపీగా ఉందని అంటున్నాడు లండన్ కు చెందిన ఆ భర్త.  


మరింత సమాచారం తెలుసుకోండి: