ఎన్నికల్లో ఘోర ఓటమి, నేతలు పార్టీ మార్పులు ఇవన్నీ తెలుగుదేశం పార్టీని కుదిపేస్తున్న అధినేత చంద్రబాబు మాత్రం కాలికి బలపం కట్టుకుని మరి జిల్లాలన్నీ తిరుగుతూ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ అధినేత ఎంత కష్టపడిన..నేతలు మాత్రా ఆ కష్టానికి తగిన ఫలితం లేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా నేతల్లో అయితే ఇంకా మార్పు రాలేదు.


ఇటీవల బాబు మూడు రోజుల పాటు విజయవాడలో మకాం వేసి నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేశారు. అందులో పార్టీ బలోపేతానికి, రాబోయే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలల్లో పార్టీ సత్తా చాటాలనే దానిపై వ్యూహాలు చెప్పారు. అయితే బాబు చెప్పినప్పుడు అందరూ బాగానే తలలు ఊపారు. కానీ ఎప్పుడైతే సమీక్షా సమావేశాలు అయ్యాయో...అప్పటి నుంచి ఎక్కడి నేతలు అక్కడ గప్చుప్ అయిపోయారు. ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా వెళ్ళిపోయారు.


విజయవాడ నగరంలో పార్టీ కొంచెం యాక్టివ్ గా ఉన్న మిగతా చోట్ల నేతలు సైలెంట్ అయిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు ఎవరు నియోజకవర్గాల్లో కనబడటం లేదు. ముఖ్యంగా మచిలీపట్నం పరిధిలో ఉన్న పెడన, గుడివాడ, అవనిగడ్డ, పామర్రు లాంటి నియోజకవర్గాల్లో నేతలు అడ్రెస్ లేరు. అటు గన్నవరంలో వల్లభనేని వంశీ వైసీపీలోకి వెళ్లిపోతున్నారు.


ఇక విజయవాడ పరిధిలో తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, విజయవాడ పశ్చిమ నియోజకవర్గాల నేతలు మళ్ళీ సైలెంట్ అయిపోయారు. పైగా కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీకి తలనొప్పిగా మారింది. అయితే జిల్లాలోని కొందరు నేతలు మాత్రమే పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబు సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసిన నేతలు పూర్తిగా యాక్టివ్ కాలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: