మన రాష్ట్రంలో నెలల తరబడి వరదతో వచ్చిన ఇసుక కొరత వల్ల ఇబ్బందులెదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వం పై మరో పిడుగు పడినట్లు అయింది.బంగాళాశాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రరూపం దాల్చినట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేసింది.


తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దిశను మార్చుకుని ఆగ్నేయంగా కొనసాగుతూ తీవ్రవాయుగుండంగా మారింది. అది ఏపీలోని బందరుకు 390 కిలోమీటర్లు.. పారదీప్‌కు 810 కి.మీ, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ దీవులకు 920 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమైంది. తీవ్రవాయుగుండం రానున్న 24 గంటల్లో తుఫానుగా, ఈ నెల 9వ తేదీ నాటికి తీవ్ర తుఫాన్ గా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.


ఈ తీవ్ర తుఫాన్‌కు వాతావరణ శాఖ బుల్‌బుల్‌గా నామకరణం చేశారు. ఆగ్నేయ దిశగా ఒడిశా -పశ్చిమ బెంగాల్ తీరం వైపు పయనిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రభావంతో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సుముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.


తాజాగా బుల్‌బుల్ తుఫాన్‌ రూపంలో ఏపీ ప్రభుత్వానికి మరో చిక్కు వచ్చి పడింది. ఇప్పటికే రాష్ట్రంలో ఇసుక దుమారం కొనసాగుతోంది. ప్రభుత్వ అసమర్థ విధానాల కారణంగానే ఇసుక కొరత ఏర్పడిందని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇప్పుడు బుల్‌బుల్ తుఫాన్ పుణ్యమాని మరికొన్ని రోజులు ఇసుక తిప్పలు తప్పేలా లేవు. ఇప్పటికే ప్రధాన నదుల్లో వరదల కారణంగా ఇసుక తీయలేకపోతున్నామని. మరో వారం రోజుల్లో వరదలు తగ్గుతాయని. అనంతరం ఇసుక పూర్తి స్థాయిలో సరఫరా చేసి అందరికి ఇబ్బందులు తొలగిస్తామని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఇలాంటి సమయంలో తుఫాన్ కాస్త జగన్ ప్రభుత్వంకి   ఇబ్బందికరంగానే మారుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: