పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన లాంగ్ మార్చ్ తో తన ప్రసంగంతో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని టార్గెట్ చేస్తున్నాడు. ఇసుక కొరత రావడంతో జగన్ పై వచ్చిన వ్యతిరేకత ని తనకి అనుగుణంగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్న పవన్ కళ్యాణ్ ని కట్టడి చేయడానికి జగన్ ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాడని సమాచారం. పవన్ కళ్యాణ్ వెనుక టీడీపీ ఉండి తనని ముందు నడిపిస్తుందని వైసీపీ భావిస్తున్నారు. 


పవన్ కళ్యాణ్ ని ఇంటి దారి పట్టించాలనే జగన్ ఒక్క కొత్త వ్యూహాన్ని అమలుపరుస్తున్నాడని... అందుకే సీపీం రాష్ట్ర కార్యదర్శి మధును పరామర్శించారని పలు రకాల ఊహాగానాలు రాజకీయ వర్గాల మధ్య వెల్లువెత్తుతున్నాయి. అయితే సార్వత్రిక ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ వెంటే నడిచిన వామపక్షాలు ఇపుడు అతనికి ఏ మాత్రం సపోర్ట్ చేయడం లేదు. ఈ మధ్య జరిగిన పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కి కూడా సీపీఐ, సీపీఎం పార్టీ నాయకులు రాలేదు. ఇదే అదునుగా భావించి...గతంలో పవన్ తో సన్నిహితం గా ఉన్న వామపక్షాలను తనవైపు లాక్కునే యత్నంలో జగన్ ఉన్నారని విపరితంగా ప్రచారం జరుగుతుంది. 


ఎప్పుడూ కలవని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును జగన్ అకస్మాత్తుగా కలవడమేంటి దీనిలో ఏదో ఆంతర్యం ఉందని చాలా మంది చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కి వామపక్షాలను శాశ్వతంగా దూరం చేస్తే ఆయన రాజకీయంగా బలహీన పడతాడని.. అదే సమయంలో వైసీపీ వామపక్షాల తో కలిసి ధృడపడుతుందని... అలాగే ఆంధ్రప్రదేశ్ లోనే స్థానిక ఎన్నికలలో వారికి లాభం చేకూరుతందనే ఆలోచనలో జగన్ మోహన్ రెడ్డి ఉన్నాడని స్పష్టమవుతుంది. జగన్ వేసే ఈ వ్యూహం పవన్ కళ్యాణ్ పై ఎంత ప్రభావం చూపుతుందో తెలియాలంటే మనం కొన్ని నెలలు వేచి చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: