మహారాష్ట్రలో ఈరోజుతో ప్రభుత్వం గడువు ముగుస్తుంది.  అయితే, ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాలేదు.  కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకపోవడంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠత నెలకొన్నది.  ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నాయా అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి.  బీజేపీ నేతలు నిన్నటి రోజున గవర్నర్ భగత్ సింగ్ ను కలిసి మాట్లాడారు.  ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు.  


ఎందుకంటే ఆ పార్టీకి సొంతంగా 105 సీట్లు ఉన్నాయి.  మిగతా చిన్న పార్టీలు, స్వతంత్రలు కలిపి 121 మంది మద్దతు వచ్చింది.  ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అంటే 145 మంది కావాలి.  అంటే ఇంకా 24 మంది మద్దతు అవసరం ఉంటుంది.  ఈ సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కుదరదు కాబట్టి దీనిపై చర్చించేందుకు భగత్ సింగ్ ను కలిశారు బీజేపీ నేతలు.  అయితే, ఇప్పట్లో రాష్ట్రపతి పాలనా ఉండకపోవచ్చని, ప్రభుత్వం ఏర్పాటుకు మరికొంత సమయం ఇచ్చే విధంగా చూస్తానని గవర్నర్ చెప్పినట్టుగా సమాచారం.  


ఇచ్చిన అదనపు గడువులోపు ప్రభుత్వం ఏర్పాటు జరగాలి.  ఒకవేళ అప్పటికి కూడా కాకుంటే అప్పుడు రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది.  కానీ, శివసేన మాత్రం తమకు మద్దతు ఉందని, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మద్దతు ఉందని చెప్తున్నా.. ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదు.  మెజారిటీ ఉన్నప్పుడు శివసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యొచ్చు కదా.. 


అలా చేయడం లేదు అంటే, మద్దతు లేనట్టే కదా.  శివసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదు.. బీజేపీకి మద్దతు ఇవ్వదు.  అటు చేయకుండా, ఇటు చేయకుండా అలానే తాత్సారం చేస్తున్నది.  దీని వలన ఎలాంటి విషమ పరిస్థితులు వస్తాయో అని భయపడుతున్నారు ప్రజలు.  చూద్దాం ఏం జరుగుతుందో.. ఎలాంటి పరిణామాలు జరుగుతాయో.  శివసేన కాస్త మెతకవైఖరి అవలంభించి ప్రభుత్వం ఏర్పాటుకు సహకరిస్తే.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.  లేదంటే ఏమున్నది ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగిస్తే సరి.  


మరింత సమాచారం తెలుసుకోండి: