టీడీపీ అధికారంలో ఉండగా నియంతలా వ్యవహరించి చేసిన పనులకు ఇప్పడు ఎదురుదెబ్బలు గట్టిగానే తగులుతున్నాయి. అధికారదర్పంతో టీడీపీ ఇష్టానుసారం తీసుకున్న నిర్ణయాలకు వైసీపీ అధికారంలోకి వచ్చాక అడ్డుకుంటుంది. రాష్ట్రంలో ఇసుక కొరతపై ఈ నెల 14న చంద్రబాబు ఒక రోజు నిరసన దీక్ష చేయనున్న సంగతి తెలిసిందే. ఇందుకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంను ఎంచుకున్నారు. ఈ దీక్షకు స్టేడియంలో నిర్వహించేందుకు సంబంధిత శాఖలు ససేమిరా అంటున్నాయి.

 


మున్సిపల్ స్టేడియంలో దీక్షకు అనుమతివ్వాలని పోలీసు, మున్సిపల్ కమిషనర్‌లను కోరుతూ ఇప్పటికే అర్జీ పెట్టుకుంది టీడీపీ. దీనిపై సంబంధిత అధికారులు స్పందిస్తూ.. ప్రభుత్వ కార్యక్రమాలకు తప్ప మరే ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదని అధికారులు తేల్చి చెప్పారు. పట్టు వీడని టీడీపీ.. ప్రభుత్వం అనుమతి నిరాకరించినా గాంధీనగర్ లోని అలంకార్ సెంటర్ వద్ద గల ధర్నా చౌక్ లో దీక్ష చేసి తీరుతామని టీడీపీ శ్రేణులు అంటున్నారు. ఇప్పటికే దీనిపై కసరత్తు ప్రారంభించారు. అధికారం అండతో, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ అయిదేళ్ల పాటు బెంజి సర్కిల్ సెంటర్లో నవ నిర్మాణ దీక్ష చేసింది టీడీపీ.

 


చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెం.150 ఆడియో ఫంక్షన్ స్టేడియంలో నిర్వహించేందుకు అనుమతివ్వాలని కోరితే ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే అంటూ నిరాకరించింది. అదే మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాట సీఎం హోదాలో దీక్ష చేశారు చంద్రబాబు. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికుల కోసం దీక్ష అంటూ మున్సిపల్, పోలీసుల అధికారులకు అర్జీ పెట్టుకుంటే అదే సమాధానం ఇచ్చారు ఉన్నతాధికారులు. దీనిపై టీడీపీ శ్రేణులు పట్టుదలగా ఉన్నారు. సభ నిర్వహించి తీరుతామంటున్నారు. మరోవైపు బాలల దినోత్సవాన దీక్ష చేయడమేంటని మంత్రి బొత్స విమర్శించిన విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: