రాజ‌కీయాల్లోకి ఎందుకు వ‌చ్చారంటే.. ప్ర‌జాసేవ కోసం అని చెప్పే నాయ‌కుల సంఖ్య ఒక‌ప్ప‌టి మాట‌. ఇప్పు డు మాత్రం ఎలాంటి మొహ‌మాటం లేకుండా.. రాజ‌కీయాల్లోకి ఎందుకు వ‌చ్చామంటే.. వ్యాపారాలు, ఆస్తులు అభివృద్ది చేసుకోవ‌డం కోసం.. అని చెబుతున్న నాయ‌కులు పెరుగుతున్నారు. ఇవ‌న్నీ పోను ఏదైనా టైం మిగిలితే.. అప్పుడు ప్ర‌జాసేవ అంటూ ముక్తాయిస్తున్నారు. ఇలాంటి నాయ‌కులు ఉన్న ఈ రోజుల్లో.. అధికా రం కోసం ఎలాంటి ప‌రిస్థితినైనా అధిగ‌మించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.


ఒక‌వేళ అధికారం రాక‌పోతే.. అధి కారంలో ఉన్న పార్టీతోనైనా చేతులు క‌లిపితే పోయేదేముంది? అని స‌ర్ది పెట్టేసుకుంటున్నారు. ఇలాంటి ప‌రిస్థితి ఇప్పుడు ఏపీ విప‌క్షం టీడీపీలో ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఇటీవ‌ల వ‌ర‌కు అధికారంలో ఉ న్న టీడీపీలో దాదాపు నాయ‌కులు అంద‌రూ కూడా ఏదో ఒక వ్యాపారంలో మునిగిపోయారు. ర‌వాణా రంగమో.. ఆక్వానో.. డెయిరీనో.. రియ‌ల్ ఎస్టేటో.. ఇలా ఒక‌ట‌నేముంది. వారికి న‌చ్చిన రంగంలో వారు దూసు కుపోయా రు. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు.


ఈ క్ర‌మంలోనే బ్యాంకుల నుంచి కూడా భారీగా రుణాలు తీసుకున్నారు. దీనికితోడు మ‌ళ్లీ చంద్ర‌బాబు ప్ర‌భుత్వ‌మే రాష్ట్రంలో అధికారంలోకి వ‌స్తుంద‌ని భావించా రు. ఆయ‌న ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలు, అమ‌లు చేసిన సంక్షేమం, ఇచ్చిన డ‌బ్బులు వంటివి పార్టీ మ‌ళ్లీ అధికారంలోకి తీసుకురావ‌డం ఖాయ‌మ‌ని అనుకున్నారు. అయితే, అనూహ్యంగా ప్ర‌జ‌ల మూడ్ మారిపోయింది. టీడీపీకి జ‌ల్ల‌కొట్టి వైసీపీని అంద‌లం ఎక్కించారు. దీంతో ఒక్క‌సారిగా టీడీపీలో వ్యాపార నాయ‌కులు, పెట్టుబ‌డి వీరులు డంగ‌య్యారు. ఇక‌, త‌మ ప‌రిస్థితి ఏంటి?  ఉప్పు-నిప్పు వంటి పార్టీల మ‌ధ్య ఉంటూ.. వ్యాపారాలు సాగించేదెలా? అని త‌ల‌లు ప‌ట్టుకున్నారు.


అయితే, ఎంత స‌మ‌స్య‌కైనా ఎక్క‌డో ఒక‌చోట ప‌రిష్కారం లేకుండా పోతుందా? అదేవిధంగా టీడీపీ నాయ‌కులు అధికార ప‌క్షంలోని నేత‌ల‌తో రాజీ ప‌డ్డారు. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌ర్దుకు పోతున్నారు. వారి వారి వ్యాపారాల‌కు, వ్య‌వ‌హారాల‌కు అడ్డు రాకుండా ముందస్తు ఒప్పందాలు చేసుకున్నారు. ఫ‌లితంగా రాష్ట్రంలో చంద్ర‌బాబు అనేక ఉద్య‌మాల‌కు, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై నిర‌స‌న‌ల‌కు పిలుపు ఇస్తున్నా.. చాలా మ‌టుకు నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ్ముళ్లు స్పందించ‌డం లేదు. దీని వెనుక ఉన్న సంగ‌తి ఇదేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. సో.. మొత్తానికి రాష్ట్రంలో మిలాఖ‌త్ రాజ‌కీయాలు పుంజుకున్నాయ‌న్న‌మాట‌!



మరింత సమాచారం తెలుసుకోండి: