నిన్న సంచలనాత్మకమైన, చారిత్రాత్మకమైన తీర్పును చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ వెల్లడించారు. సుప్రీం కోర్టు పురావస్తు శాఖ ఆధారాల ఆధారంగా అయోధ్య రాముడిదేనని అక్కడే రాముడు జన్మించాడని తీర్పునిచ్చింది. ప్రస్తుతం అయోధ్య కేసు తీర్పు తరువాత ప్రజల్లో శ్రీరాముడు నిజంగా అయోధ్యలోనే జన్మించాడా....? అనే ప్రశ్నలు మెదులుతున్నాయి. పురాణాలు రాముడు అయోధ్యలోనే జన్మించాడని చెబుతున్నాయి. 
 
ఇండియన్ ఇన్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ వేదాస్ అనే సంస్థ శ్రీరాముడు క్రీస్తు పూర్వం 5,114 లో జనవరి 10వ తేదీన అర్ధరాత్రి సమయంలో 12.45 నిమిషాలకు జన్మించినట్లు నిర్ధారించింది. ప్లానిటోరియం అనే ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ఉపయోగించి ఖచ్చితమైన కాల నిర్ధారణ చేసి శ్రీరాముని జన్మదినానికి సంబంధించిన వివరాలను శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ సాఫ్ట్ వేర్ ద్వారా శాస్త్రవేత్తలు రాముడి పుట్టినరోజు గురించి సమయం, సంవత్సరంతో చెప్పగలిగారు. వాల్మీకి రామాయణంలో రాముడు వనవాసానికి వెళ్లేటప్పుడు రాముని వయస్సు 25 అని పేర్కొన్నారు. ఐదు గ్రహాలు ఉచ్ఛ దశలో రాముడు జన్మించిన సమయంలో ఉన్నాయని కూడా రామాయణంలో పేర్కొన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ పరిశోధకులు అయోధ్యలో రాముడు జన్మించాడని రామాయణం నిజంగా జరిగిందని కూడా ఆధారాలు సంపాదించారు. 
 
నిన్న కోర్టు తీర్పులో అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిలో రామ మందిరం ఏర్పాటు చేయాలని 3 నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఆలయ నిర్మాణ బాధ్యతలను ట్రస్ట్ కు అప్పగించాలని కోర్టు పేర్కొంది. సున్నీ వక్ఫ్ బోర్డ్ కు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం ప్రభుత్వం కేటాయించాలని సున్నీ వక్ఫ్ బోర్డుకు మసీదు నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని తెలిపింది. 
అయోధ్య కేసు విచారణలో సుప్రీం కోర్టు లోతైన పరిశోధనలు చేసింది. 533 లిఖిత పూర్వక సాక్ష్యాలను, 88 మంది సాక్షుల వాంగ్మూలాలను ఆలకించింది. 




మరింత సమాచారం తెలుసుకోండి: