చెన్నైలో పిల్ల‌ల‌తో అస‌భ్య కార్య‌క‌లాపాలు చేయిస్తోన్న లేడీ టీచ‌ర్ కేసును విచారిస్తోన్న పోలీసుల‌కు దిమ్మ‌తిరిగిపోయే నిజాలు తెలుస్తున్నాయి. సెక్స్ ఎడ్యుకేష‌న్ పేరుతో లేడీ టీచర్ సంజనా (28), ఆమె ప్రియుడు బాలాజీ విద్యార్థుల జీవితాల‌తో ఆడుతోన్న అరాచ‌కాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఆమె పేరుకు మాత్ర‌మే ప‌విత్ర‌మైన ఉపాధ్యాయ వృత్తితో ఉంద‌ని.. కానీ ఆమె క్యారెక్ట‌ర్ ప‌రంగా చూస్తే కామేశ్వ‌రిని మించి పోయి ఉంద‌ని పోలీసులే చెపుతున్నార‌ట‌.


చెన్నైలోని టీ నగర్ లో అధిక శాతం శ్రీమంతులు నివాసం ఉంటున్నారు. ఇక్క‌డే సంజ‌నా (28) నివాసం ఉంటోంది. ఆమె తాను డిగ్రీ వ‌ర‌కు చ‌దువుకున్నాన‌ని.. మీ పిల్ల‌ల‌కు ట్యూష‌న్లు చెపుతాన‌ని.. వాళ్ల‌కు మంచి మార్కులు వచ్చేలా చేయ‌డం నా బాధ్య‌త అని వాళ్ల‌ను న‌మ్మించింది. దీంతో ఆ ధ‌నువంతులు అంతా త‌మ పిల్ల‌ల‌కు సంజ‌న ట్యూష‌న్ చెపితే మంచి మార్కులు వ‌స్తాయ‌ని భావించారు.


ఆమె ఆ పిల్ల‌ల‌కు తీయ‌ని మాట‌లు చెపుతూ త‌న బుట్ట‌లో వేసుకుంది. కొంద‌రు అంద‌మైన అమ్మాయిల‌ను ట్రాప్ చేసి.. తాను అందంగా ఉన్నాన‌ని మీరు కూడా నాలాగా ఉండాల‌ని చెప్పింది. నేను నా ప్రియుడు బెడ్ రూంలో ఏం చేస్తామో మీరూ చూడండి, ఇదే బెడ్ రూంలో మీరూ అలాగే చేయాల‌ని వాళ్ల‌ను రెచ్చ‌గొట్టింది. ఇక అబ్బాయిలు, అమ్మాయిల‌ను రెచ్చ‌గొట్టి బెడ్ రూంలోకి పంపి... వాళ్ల‌తో అశ్లీల ప‌నులు చేయించి వాటిని వీడియోలు తీశారు.


ఇటీవ‌ల ఓ అమ్మాయి నీర‌సంగా ఇంటికి వెళ్ల‌డంతో వారి కుటుంబ స‌భ్యులు ఆమెను నిల‌దీయ‌డంతో వీరి బండారం బ‌య‌ట‌ప‌డింది. సంజనా మేడమ్, ఆమె ప్రియుడు బాలాజీ కలిసి తనతో పాటు మరో అబ్బాయి కలిసి ఉన్న సమయంలో వీడియోలు తీశారని చెప్పడంతో వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా... వారు తీగ లాగ‌డంతో డొంకంతా క‌దిలింది. ఇక పోలీసులు విద్యార్థుల‌తో చేయించిన ప‌లు అశ్లీల వీడియోల‌ను స్వాధీనం చేసుకుని.. వారు ఈ వీడియోలు ఎవ‌రికి అయినా అమ్మారా ? అన్న కోణంలో విచార‌ణ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: