టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. 'విజన్ ఉన్న లీడర్‌కు, ఒంటి నిండా పాయిజన్ ఉన్న లీడర్‌కు తేడా ఇదేనంటూ' పట్టిసీమ ప్రాజెక్టు నేపథ్యంలో వ్యాఖ్యలు చేశారు. విజన్ ఉన్న లీడర్ రాబోయే సంక్షోభాన్ని ముందే పసిగట్టి నివారణ చర్యలు తీసుకుంటారని, పట్టిసీమ ప్రాజెక్టు అలాంటి ఆలోచన నుంచి పుట్టిందేనని వెల్లడించారు.

ఇక ఒంటినిండా పాయిజన్ ఉన్న లీడర్ ముందు చూపు లేక, వరదలు వచ్చినా వినియోగించుకోలేక, ప్రజల్ని ముంచి నీటిని సముద్రం పాలుచేస్తారని విమర్శించారు. కాగా,పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించిన ఐదు మోటార్లను శనివారం ఆన్ చేశారు. గోదావరి నీటిని పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా జిల్లాకు తరలిస్తున్నారు. అయితే సెప్టెంబర్,అక్టోబర్ నెలల్లో భారీ వర్షాలు లేని కారణంగా మోటార్లను నిలిపివేశారు. దీంతో ఈ ఏడాది కృష్ణా జిల్లాకు 50టీఎంసీలను మాత్రమే తరలించే అవకాశం ఉంది.

ఏటా జూన్-డిసెంబర్ కాలంలో 90టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. అయితే ముందుచూపు లేని జగన్ సర్కార్.. మోటార్లను ఆఫ్ చేయడం వల్లే జిల్లాకు తరలించాల్సిన నీటిలో కోత పడుతోందని లోకేశ్ అన్నారు. ఎగువ రాష్ట్రాల నుంచి ఎంత వరద వచ్చినా సద్వినియోగం చేసుకోలేక, చివరికి పనికిరాని పట్టిసీమ అన్నవాళ్లే మోటార్లు ఆన్ చేసి నీటిని అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. కాగా, గత కొన్ని రోజులుగా నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా చాలా యాక్టివ్‌గా ఉన్న విషయం తెల్సిందే.


 ఇక ఒంటినిండా పాయిజన్ ఉన్న లీడర్ ముందుచూపు లేక వరదలు వచ్చినా.. ఆ నీటిని వినియోగించుకోలేక సముద్రం పాలుచేస్తున్నారని మండిపడ్డారు. పై రాష్ట్రాల నుండి ఎంత వరద వచ్చినా ఆఖరికి రాష్ట్ర నీటి అవసరాలు తీర్చడానికి.. పట్టిసీమ మోటార్లు ఆన్ చేసే పరిస్థితి వచ్చిందన్నారు. పనికిరాని పట్టిసీమ అన్నవారే.. నేడు మళ్లీ మోటార్లు ఆన్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: