నవంబర్ లో తెలుగుదేశంపార్టీకి భారీ కుదుపు తప్పేట్లు లేదు. మహారాష్ట్ర, హర్యాన ఎన్నికల తర్వాత ఏపి విషయాన్ని ఓ చూపు చూద్దామని అనుకున్న కమలనాధులకు ఇపుడు కావాల్సినంత తీరిక దొరికిందట. దానికితోడట. దానికితోడు రామజన్మ భూమి వివాదంలో బిజెపి అనుకూలంగానే సుప్రింకోర్టు తీర్పు కూడా రావటంతో రెట్టించిన ఉత్సాహం కనబడుతోంది.

 

వరుస సానుకూలతలతో ఏపిలోని టిడిపి ఎంఎల్ఏలు, నేతలను ఆకర్షించేందుకు వ్యూహాన్ని అమల్లోకి తేవాలని గట్టిగా నిర్ణయించుకుందని సమాచారం. ఈనెలలోనే పార్టీ వర్కింగ్ ప్రెసెడింట్ జేపి నడ్డా వస్తున్నారు. చివరలో జాతీయ అధ్యక్షుడు, హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా రాష్ట్రానికి వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయటంలో భాగంగా ఇతర పార్టీల నేతలను చేర్చుకునే విషయంలో స్పష్టమైన వ్యూహాన్ని అమలు చేయాలని డిసైడ్ అయ్యింది.

 

ఇందులో భాగంగా ఇప్పటికే మాజీ ఎంఎల్ఏ వరదాపురం సూరి, చందు సాంబశివరావు, ఈదర హరిబాబు లాంటి సినీయర్ నేతలను చేర్చుకున్నారు. సాదినేని యామిని లాంటి కొందరు నేతలు బిజెపిలో చేరటం కోసమే టిడిపికి రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో కొందరు ఎంఎల్ఏలు కూడా తొందరలోనే బిజెపిలో చేరబోతున్నట్లు సమాచారం.

 

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అండ్ కో  టిడిపికి రాజీనామా చేసే విషయాన్ని సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గంటా గడచిన నాలుగు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తో మంతనాలు జరుపుతున్నారట. ఇప్పటికే బిజెపి ఎంపిలు సుజనా చౌదరి, సిఎం రమేష్ తో భేటి జరిపినట్లు సమాచారం. తనతో పాటు కనీసం మరో ఏడుగురు ఎంఎల్ఏలు బిజెపిలో చేరటానికి సిద్ధంగా ఉన్నట్లు గంటా బిజెపి పెద్దలకు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

 

పార్టీలో జరుగుతున్న ప్రచారం, పరిణామాలతో చంద్రబాబునాయుడులో టెన్షన్ పెరిగిపోతోంది. ఏ రోజు ఏ నేత పార్టీని వదిలేసి వెళిపోతారో అర్ధం కావటం లేదు. ఇప్పటికే గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ పార్టీతా పాటు ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా చేసి చంద్రబాబుకు షాకిచ్చిన విషయం తెలిసిందే. బిజెపి దూకుడు చూస్తుంటే చంద్రబాబుకు గట్టి షాక్ తగిలేట్లే ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: