జయలలిత.. భారత దేశంలోనే సంచలనం సృష్టించిన వ్యక్తి. జీవితాంతం వార్తల్లో నిలిచిన వ్యక్తి. సినిమాల్లోనూ.. తర్వాత రాజకీయాల్లోనూ పెను సంచలనం సృష్టించిన విజయతార. అందుకే ఆమె జీవితం కథగా తీయాలని ఎందరో తపిస్తున్నారు. ఎందుకంటే.. ఓ జీవితకథకు కావాల్సిన డ్రామా జయలలిత జీవితంలో ఎంతో ఉంది.


అలాంటి జయలలిత అఫిషయల్ జీవిత కథను హిందీనటి కంగనా రనౌత్ పాత్రధారిగా రూపుదిద్దుకుంటోంది. తమిళ‌నాడు దివంగ‌త ముఖ్యమంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ను `త‌లైవి` పేరుతో రూపొందిస్తున్నార. తెలుగు, త‌మిళ‌, హిందీ బాష‌ల్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ చెన్నైలో ప్రారంభ‌మైంది. బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్రలో న‌టిస్తున్నారు.


ఇక ఎంజీఆర్ లేకుండా జ‌య‌లలిత బ‌యోపిక్‌ను ఊహించ‌లేం. అలాంటి లెజెండ్రీ... త‌మిళ‌నాడు దివంగ‌త రాజ‌కీయ నాయ‌కుడు ఎం.జి.రామ‌చంద్రన్.. అదే ఎంజీఆర్‌ పాత్రలో ప్రముఖ న‌టుడు అర‌వింద‌స్వామి న‌టిస్తున్నారు. ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్‌.సింగ్ నిర్మిస్తున్నారు.


బ్లేడ్ ర‌న్నర్‌, కెప్టెన్ మార్వెల్ వంటి హాలీవుడ్ చిత్రాల్లో వ‌ర్క్ చేసిన ప్రముఖ హాలీవుడ్ మేక‌ప్ ఆర్టిస్ట్ కంగ‌నా ర‌నౌత్‌ను జ‌య‌ల‌లిత‌గా చూపిస్తున్నారు. ఇక నటనలో కంగనా రనౌత్‌కు ఎవరూ వంక పెట్టలేరు. కానీ ఒక్కటే పెద్ద చిక్కు ఉంది. జయలలిత పాత్రలో నటించాలంటే ఆ నటీమణి లావుగా కనిపించడం అవసరం. కానీ కంగనా రనౌత్ చాలా బక్క పిల్ల.


మరి కంగనా రనౌత్ జయలలిత పాత్రలో ఎంతగా ఒదిగో పోతారో చూడాలి. అయితే ఈ సినిమా జయలలిత పూర్తి జీవితానికి సంబంధించిం ది కాబట్టి.. కుర్ర జయలలితగా కంగనా రనౌత్ ఓకే.. కానీ సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు.. ఆతర్వాత రాజకీయాల్లో రేటు దేలిన సమయంలోనూ జయలలిత ఉక్కు మనిషిలాగా నే కనిపించారు. కానీ అసలు కథ అంతా ఆమె రాజకీయాల్లోకి రావడంతోనే రసకందాయంలో పడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: