ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ ఆర్‌.గోపిగౌడ్, సీపీఎం  జిల్లా కార్యదర్శి జబ్బార్, ప్రజావాగ్గేయకారుడు రాజారాంప్రకాశ్‌ ఏమన్నారంటే   ఆర్టీసీ కార్మికుల పోరాటాన్ని పోలీసుల నిర్భందాలతో ఆపాలనుకోవడం ప్రభుత్వ అవివేక చర్య అని అన్నారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 37వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని సమ్మెశిబిరం నుంచి ఆర్టీసీ కార్మికులు మూతికి నల్లగుడ్డలు కట్టుకుని బస్టాండ్‌ మీదుగా, రాజీవ్‌చౌక్, బస్‌ డిపోరోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు.


ఆర్టీసీ డిపోఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ  ఆందోళన చేపట్టారు.  చలో ట్యాం క్‌బండ్‌లో పోలీసులు వ్యవహరించిన తీరు తెలంగాణ సమాజం సిగ్గుపడేలా ఉందని  ఈ సందర్భంగా తెలియచేసారు  . పోలీసుల తీరు అమానుషమని, సమైక్య పాల కుల హయాంలోకంటే దారుణంగా వ్యవహరించారని ఆరోపించారు. ఎన్ని రకాలుగా ప్రభుత్వం  ఇబ్బంది  పెట్టిన  మా  డిమాండ్లు సాధించే వరకు పోరు ఆపటం జరగదని  అన్నారు. న్యాయస్థానాలు సూచించినా, 36 రోజులుగా ఏకధాటిగా ప్రజలు పోరాటం చేస్తున్నా.. ప్రభుత్వం ఏమి స్పందించకుండా మౌనంగా వుండటం  ఏమిటని నిలదీశారు. అస్సలు ఆర్టీసీని రక్షించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే చర్చలకు ఎందుకు పిలవడం లేదన్నారు.


ప్రభుత్వ పెద్దలు ఆర్టీసీని నిర్మూలించాలనే ఆశయంతోనే  ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపేందుకు ముందుకు రావడంలేదని ఆరోపించారు. ప్రభుత్వ నిరంకుశ నిర్ణయాలతో పదుల సంఖ్యలో కార్మికులు అమరులు అవుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు.  రెండు నెలలుగా ఆర్టీసీ కార్మికులు పస్తులతో  ఆర్టీసీని బతికించుకునేందుకు పోరాటం చేస్తున్నారు ,తెలంగాణపోరాట స్ఫూర్తితోనే ఆర్టీసీని కాపాడుకునేంత వరకు ప్రజాస్వామ్యపద్ధతిలో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.


ఆర్టీసీపై ఉన్నతాధికారులు హైకోర్టుకు ఇస్తున్న నివేదికలతోనే ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు వెంకటయ్య, రమేష్, వీవీమూర్తి, శ్రీలత, ప్రభరాణి, లక్ష్మీ, రేణుక, చపలతిరెడ్డి, నందిమల్ల నాగరాజు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: