వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తరువాత అనేక పధకాలు ప్రవేశపెట్టారు.  నవరత్నాలను వరసగా అమలు చేస్తూ ప్రజలకు చేరువయ్యారు.  ఒక్క నవరత్నాలు మాత్రమే కాదు.. జగన్ పాదయాత్ర చేసే సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని  నెరవేరుస్తూ వస్తున్నారు.  పాదయాత్ర సమయంలో ఆయన్ను చిన్న చిన్న ఉద్యోగులు కూడా జగన్ ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు.  తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉద్యోగుల జీతాలు ఎంత దారుణంగా ఉండేవో తెలిసిందే.  


వచ్చే కొద్దీ జీతంతో బతకలేకపోతున్నామని ఆయనతో పేర్కొన్నారు.  అధికారంలోకి వచ్చిన తరువాత తప్పకుండా చేస్తామని చెప్పారు.  జగన్ చెప్పినట్టుగానే వరసగా చేసుకుంటూ పోతున్నారు.  పారిశుధ్య కార్మికుల జీతాలు పెంచారు.  అలానే, హోమ్ గార్డ్ ల జీతాలను కూడా పెంచారు.  అలానే 4 లక్షల ఉద్యోగాలు కల్పించారు.  ప్రతి జనవరి నెలలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను వెలువడబోతున్నది.  


ఇక ఇదిలా ఉంటె, తాజగా ఆంధ్రప్రదేశ్ లో యానిమేటర్లు, స్వయం సేవక సంఘాలు, వీఏఓ లకు జీతాలను 10వేలకు  పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.  ఈ నిర్ణయం మేరకు ఉద్యోగులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ ఆనందాన్ని జగన్ తో పంచుకోలేకపోయినా.. తమ జీవితాల్లో వెలుగులు నింపిన జగన్ ను దేవుడిగా  భావించి పూజలు చేయడం  మొదలుపెట్టారు. 


జగన్ ఫోటోలకు పాలాభిషేకం చేశారు.  జగన్ తమ పాలిట  దేవుడు అని, జగన్ తమ జీవితాల్లో వెలుగులు నింపాడని అంటున్నారు.  జగన్ ఒక్క యానిమేటర్లు  మాత్రమే కాదు, ఎందరికో జగన్  సహాయ సహకారాలు చేశారు.  ఇలా సహాయ సహకారాలు చేస్తున్న జగన్ ఆంధ్రప్రదేశ్ లో ఎందరికో ఆరాధ్యదైవంగా మారదు.  పూజ్యనీయుడు అయ్యారు.  నాలుగైదు నెలలోనే జగన్ ఇలాంటి ఎన్నో గొప్ప పనులు చేస్తే.. ఐదేళ్ళలో ఇంకెన్ని గొప్ప పనులు చేస్తాడో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: