జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వైవాహిక జీవితం అంతగా కలసిరాలేదు. ఆయన చేసుకుని రెండు పెళ్లిళ్లు సజావుగా సాగలేదు. మొదట వైజాగ్ కు చెందిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్న పవన్ ఆమెతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సినీ హీరోయిన్ రేణు దేశాయ్ ను పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు ఈ కాపురం సజావుగానే సాగినా.. ఆ తర్వాత ఆమెతోనూ పవన్ కల్యాణ్ విడాకులు తీసుకున్నారు.


కొన్నేళ్ల క్రితం ఆయన ఓ రష్యన్ యువతిని పెళ్లి చేసుకున్నారు. అయితే పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల వ్యవహారం ఆయన రాజకీయ జీవితంపైనా ప్రభావం చూపుతోంది. పబ్లిక్ లైఫ్ లో ఉన్నవారి ప్రైవేటు లైఫ్ పై కూడా విమర్శలు వస్తూనే ఉంటాయి. తాజాగా.. మరోసారి పవన్ పెళ్లిళ్ల అంశం హాట్ టాపిక్ అయ్యింది. ఇంగ్లీష్ మీడియం విషయంలో సోమవారం ఏపీ సీఎం మాట్లాడతూ... పవన్ కల్యాణ్ కు మగ్గురు భార్యలు.. నలుగురో ఐదుగురో పిల్లలు.. వాళ్లు ఏ మీడియంలో చదువుతున్నారు.. అన్నారు.


ఈ కామెంట్లపై పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. మేం విధానాలపై మాట్లాడుతుంటే.. జగన్ రెడ్డి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని పవన్ మండిపడ్డారు. మీరు ఎంతగా టార్గెట్ చేసిన మేం మాత్రం విధానాలపైనే మాట్లాడతామన్నారు. ఇదే సమయంలో పవన్ కాస్త ఆగ్రహంగా స్పందించారు. మాట్లాడితే మూడు పెళ్లిళ్లు అంటారు.. మీరు చేసుకోండి ఎవరు వద్దన్నారు అంటూ రియాక్టయ్యారు.


నేనేమీ సరదా కోసం మూడు పెళ్లిళ్లు చేసుకోలేదు.. నాకు కుదరలేదు.. మీకేంటి ఇబ్బంది అంటూ ఎదురు ప్రశ్నించారు. మాట్లాడితే మూడు పెళ్లిళ్లు అంటారు... అవసరమైతే మీరూ చేసుకోండి.. అంటూ స్పందించారు. అయితే జగన్ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఎదురుదాడిపై విమర్శలు వస్తున్నాయి. అవసరమైతే మీరూ చేసుకోండి అని పవన్ కల్యాణ్ స్పందించడం సరికాదంటున్నారు. పవన్ కల్యాణ్ చేసుకున్నాడని..అందరూ అలా మూడు మూడు పెళ్లిళ్లు ఎలా చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. తా చెడ్డ కోతి వనమంతా చెరిచిందన్న సామెత తరహాలో పవన్ కామెంట్లు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు ఆంధ్రా జనం.


మరింత సమాచారం తెలుసుకోండి: