మహారాష్ట్ర రాజకీయం అనేక మలుపులు తిరుగుతూ చివరికి రాష్ట్రపతి పాలనతో తెర పడింది. మహారాష్ట్ర గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా బీజేపీ పార్టీని ఆహ్వానించినా బీజేపీ తమకు పూర్తి స్థాయి మద్దతు లేదని చెప్పి ప్రభుత్వ ఏర్పాటు కు నో చెప్పేసింది. ఇక బంతి శివసేన వైపు కి వెళ్లి ఆ తరవాత ఎన్సీపీ కోర్టు లోకి వెళ్ళినట్లే వెళ్లి చివరికి రాష్ట్రపతి పాలనను ఓకే చేసింది. 
ఇక ఇప్పుడు అందరీ చూపు బీజేపీ పార్టీ వైపే ఉంది. భాజపా-శివసేన కూటమిగా పోటీచేసి మొత్తం 288 స్థానాల్లో భాజపా 105, శివసేన 56 స్థానాల్లో విజయం సాధించాయి. దీంతో ఈ కూటమికి మెజార్టీ లభించింది. అయితే సీఎం పీఠాన్ని చెరి రెండున్నర సంవత్సరాలు పంచుకోవాలని శివసేన పట్టుబట్టడంతో ఇరు పక్షాల మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పాలనతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కచ్చితంగా భాజపాకు అనుకూలంగా మారే అవకాశముంది. సీఎం పదవిపై కఠినంగా వ్యవహరించిన శివసేన ప్రజల ముందు ఒక దోషి ల నిలబడనుందా? అంటే అవుననే సమాధానం చెప్పక తప్పదు. 
2014 అసెంబ్లీ ఎన్నికల్లో సేనతో జట్టుకట్టకుండా వేరుగా పోటీచేసి ఏకంగా 122 సీట్లను సాధించగా సేన కేవలం 63 సీట్లను మాత్రమే గెలిచింది. ఈ ఎన్నికల్లో  సేనతో పాటు చిన్న చిన్న పక్షాలతో కూటమి కట్టినా.. ఏకంగా 17 సీట్లను నష్టపోయింది. ఒకరకంగా చూస్తే శివసేనతో పొత్తు ఆ పార్టీకి నష్టం చేసిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శివసేన కు రెండున్నర ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి నీ బీజేపీ ఆఫర్ చేసేందుకు తిరస్కరించింది అన్నది నగ్న సత్యం. ఇక రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నందున మెజారిటీ స్థానాలు సంపాదించిన బీజేపీ పార్టీలోకి ఈరోజో రేపో ఎమ్యెల్యే లు జంప్ అయ్యే అవకాశాలు పుష్కలం. కావున బీజేపీ పార్టీ "బంతి చివరికి మన కోర్టు లో కే వస్తుంది" అనే ధీమాతో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: