ఈ మధ్య కాలంలో వాయు కాలుష్యం అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. ఢిల్లీ లాంటి ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంది. ఊపిరి పీల్చుకోవడానికి ప్రజలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఢిల్లీ నగరంలో నెలకొంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉన్న నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా కోల్ కతా ఆ తరువాత స్థానంలో ఉన్నట్టు వెల్లడించింది. దక్షిణాది నగరాలతో పోలిస్తే ఉత్తరాది నగరాల్లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంది. 
 
నిపుణులు ఉత్తరాది రాష్ట్రాల్లోని నగరాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కూడా వాయు కాలుష్యం పరీక్షలు నిర్వహించారు . నిపుణులు దక్షిణాది రాష్ట్రాలు వాయు కాలుష్యంలో సేఫ్ జోన్ లో ఉన్నట్టు నివేదికలో వెల్లడించారు. నిపుణులు వెల్లడించిన నివేదికలో హైదరాబాద్ నగరం సేఫ్ అని వచ్చింది. హైదరాబాద్ నగరవాసులకు ఇది నిజంగానే శుభవార్త అని చెప్పవచ్చు. 
 
హైదరాబాద్ నగరంలోని అధికారులు నగరంలోని వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. గాలిలోని దుమ్ము, ధూళి కణాలను నిపుణులు క్యూబిక్ మీటర్ ఉపయోగించి కొలుస్తారు. జాతీయ వాయు ప్రమాణాల లెక్కల ప్రకారం గాలిలో 2.5 మైక్రాన్ల పరిమాణంలో 40 మైక్రోగ్రాముల దుమ్ముకణాలు ఉండాలి. హైదరాబాద్ నగరంలో 2.5 మైక్రాన్ల పరిమాణంలో 50 మైక్రోగ్రాముల దుమ్ముకణాలు ఉన్నాయి. 
 
గాలిలో 10 మైక్రాన్ల పరిమాణంలో 60 మైక్రోగ్రాములు దుమ్ముకణాలు ఉండాలి. హైదరాబాద్ నగరంలొ 10 మైక్రాన్ల పరిమాణంలో 100 మైక్రోగ్రాములు దుమ్ముకణాలు ఉన్నాయి. సాధారణ స్థాయి కంటే సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ 4 పాయింట్లు ఎక్కువగా ఉంది. ఉండాల్సిన దాని కంటే కొంత మొత్తం ఎక్కువగా దుమ్ముకణాలు ఉన్నప్పటికీ హైదరాబాద్ నగరవాసులు వాయు కాలుష్యం గురించి ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: