ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షల తేదీ రానే వచ్చేశాయి. ఏపీపీఎస్సీ సవరించిన గ్రూప్ - 1 మెయిన్స్ పరీక్షల తేదీని ప్రకటించింది. వాస్తవానికి ఈ పరీక్షలు డిసెంబర్ 12 వ తేదీ నుంచి జరగాలి. కానీ ప్రిలిమ్స్ ఫలితాల విడుదల ఆలస్యం కావడంతో ప్రిపరేషన్ కు సమయం లేదని అభ్యర్దులు అభ్యర్థించారు. దీనితో స్పందించిన ఏపీపీఎస్సీ సవరణ షెడ్యూల్ ను విడుదల చేసింది. పరీక్షల షెడ్యూల్ ప్రస్తుతం ఈ విధంగా ఉంది. 
 
గ్రూప్‌-1 సర్వీసెస్‌ (నోటిఫికేషన్‌ నెం.27/2018) మెయిన్స్‌ పరీక్షలు 2020 ఫిబ్రవరి 4 నుంచి 16వ తేదీ వరకు జరగనున్నాయి. మొత్తం పరీక్షలని ఏడు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. వాటి వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. మరి ఆ వివరాల్లోకి వెళితే...


2020  ఫిబ్రవరి 4న తెలుగులో పేపర్‌ (క్వాలిఫైయింగ్‌ ఎగ్జామ్‌), 2020  ఫిబ్రవరి 5న ఇంగ్లీషులో పేపర్‌(క్వాలిఫైయింగ్‌ ఎగ్జామ్‌), 2020  ఫిబ్రవరి  7న పేపర్‌-1 పరీక్ష, 2020  ఫిబ్రవరి  10న పేపర్‌-2 పరీక్ష, 2020  ఫిబ్రవరి  12న పేపర్‌-3 పరీక్ష,  2020 ఫిబ్రవరి  14న పేపర్‌-4 పరీక్ష, 2020 ఫిబ్రవరి  16న పేపర్‌-5 పరీక్షలు జరుగుతాయి. 
ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌(నోటిఫికేషన్ నెం.10/2018) మెయిన్స్‌ పరీక్షలు 2020 మార్చి 17 నుంచి 19వ తేదీ వరకు ఐదు సెషన్లలో జరుగుతాయి.

డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌(నోటిఫికేషేషన్ నెం.20/2018) మెయిన్స్‌ పరీక్షలు 2020  మార్చి 19, 20 తేదీల్లో మూడు సెషన్లలో నిర్వహిస్తారు. అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్స్‌(నో.నెం.16/2018) పోస్టులకు ప్రొవిజినల్‌గా ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్‌ నోటీసు బోర్డుతో పాటు https://psc.ap.gov.in వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆంజనేయులు తెలిపారు. ఇంక ఎందుకు ఆలస్యం అప్లై చేసి జాబ్ తెచ్చుకోవడానికి సన్నద్ధం అవ్వండి. అల్ ది బెస్ట్.


మరింత సమాచారం తెలుసుకోండి: