రాష్టంలో ఇసుక కొరత .. తెలుగు మీడియం బదులు ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం ఇవన్నీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తుతున్నాయి. ప్రభుత్వం మీద విరుచుకుపడటానికి వీటిని కారణాలుగా చెబుతున్నారు. అయితే ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఇసుక కొరతపై విపక్షాలు రార్దాంతం చేయటంతో పాటు.. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధనపై సామాన్యులు సంతోషంగా ఉంటే..కొన్ని వర్గాలు మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారాన్ని చేస్తున్న వేళ.. తాజా కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఇసుక కొరతకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాటు.. కొన్ని కీలక నిర్ణయాల్ని తీసుకున్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే రెండేళ్ల జైలుశిక్ష విధించే నిర్ణయానికి సానుకూల స్పందన వ్యక్తమైంది.


గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఇప్పుడు జరగకూడదని వైసీపీ భావిస్తుంది. అదే సమయంలో ఆరో తరగతి నుంచి ప్రభుత్వ పాఠాశాలల్లో ఇంగ్లిషు మీడియం విద్యా బోధనకు కేబినెట్ పచ్చ జెండా ఊపింది. ఆరో తరగతి నుంచి అన్ని ప్రభుత్వ.. జిల్లాపరిషత్ పాఠశాల్ల్లో ఇంగ్లిషు మీడియంలో పాఠాలు బోధించాలని డిసైడ్ చేశారు. అదే సమయంలో మొక్కజొన్న ధరలు పడిపోవటంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. వారం క్రితం వరకూ క్వింటాలుమొక్కజొన్న ధర రూ.2200 ఉండగా.. ఇప్పుడు రూ.1500లకు పడిపోవటంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.


ఇటువంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవటానికి అన్ని ప్రయత్నాలు చేయాలని జగన్ మంత్రులకు దిశా నిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో మొక్కజొన్న రైతులకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకు వీలుగా కనీస మద్దతు ధర రూ.1750 కూడా రావటం లేదని మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి రైతులు నష్టపోకుండా తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. రైతులకు నష్టం వాటిల్లకుండా కొనుగోళ్లు జరపాలని నిర్ణయించారు. సీఎం జగన్ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: