రేపోమాపో వ‌ర‌ద‌లు తగ్గుతాయి.. ఇసుక సంవృద్ధిగా ల‌భిస్తుంది.. అంద‌రికీ ప‌నులు దొరుకుతాయి.. ఈ విష‌యంలో  అందరికీ ఈ క్లారిటీ ఉంది. అయితే సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం గ‌ల టీడీపీ అధినేత చం ద్ర‌బాబుకు ఈ విష‌యం తెలియ‌ని కాదు.. అయిన‌ప్ప‌టికీ ఇసుక కొర‌త అంశంపై విజ‌య‌వాడ‌లో 12 గం ట‌ల దీక్ష‌కు దిగ‌డం వెనుక బాబు వ్యూహం ఏమిటి..?  తాను నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన వెంటనే.. ప్రభుత్వం భ‌య‌ప‌డింద‌ని, తన దీక్షకు త‌లొగ్గి, సీఎం జగన్ ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తున్నారని కూడా బాబు తేల్చేశారు.


ఇదంతా బాగానే ఉంది.. చంద్రబాబుకు భయపడ్డారో లేదో మొత్తానికి జగన్ సర్కారు ఇసుకను రోజుకు రెండు లక్షల టన్నుల వంతున అందుబాటులో ఉంచబోతోంది. అయినా సరే చంద్రబాబునాయుడు మా త్రం తాను తలపెట్టిన దీక్షను చేయదలచుకున్నారు. అయితే రాజకీయ మనుగడ కోసం.. ప్రజల్లో హైప్ సృష్టించడం కోసమే చంద్ర‌బాబు ఇలాంటి డ్రామా కు తెర‌లేపార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.  


కానీ... ఇ ప్పుడిప్పుడే చురుగ్గా జరుగుతున్న తమ కూలి పనులు మానుకుని.. భవన నిర్మాణ కార్మికులంతా తన దీక్షకు తరలి రావాలని ఆయన పిలుపు ఇవ్వడం వెనుక ఆంత‌ర్యం ఏమిటి..? వర్షాలు.. ఇసుక లభ్యత లేకపోవడం కారణంగా కొన్ని రోజులగా మందగించి ఉన్న నిర్మాణరంగం ఇప్పుడే గాడిన పడుతోంది. కొన్నాళ్లుగా ఇసుక అవైలబిలిటీ పెరుగుతోంది. లక్షటన్నులకు పైగా ఇప్పుడు ప్రతి రోజూ దొరుకుతోంది. రేపటినుంచి ఇసుక వారోత్సవాలని ముఖ్యమంత్రి ఆల్రెడీ ప్రకటించారు. 


రోజుకు రెండు లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉంటుందన్నారు. రాష్ట్రంలో రీచ్ ల సంఖ్యను కూడా పెంచారు. ప్రభుత్వ పరంగా ఎన్ని ఏర్పాట్లు చేయవచ్చో అంతా చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ చంద్రబాబు దీక్షకు దిగి, కార్మికులంతా రావాలని పిలుపు ఇవ్వడం హాస్యాస్ప‌ద‌న‌మే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఇసుక కొర‌త‌పై దీక్ష పేరుతో చంద్ర‌బాబు చేస్తున్న హ‌డావిడిని అధికార పార్టీతో పాటు, ప్ర‌జ‌లు కూడా తేలిగ్గా తీసుకున్న‌ట్లే క‌నిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: