రాష్ట్రంలో ఇసుక కొరత, భవననిర్మాణ కార్మికుల కోసమంటూ టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం విజయవాడ ధర్నా చౌక్ లో 12 గంటల పాటు నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ దీక్షపై అధికార వైసీపీ నేతలు వరుసగా విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు కూడా బాబుపై తీవ్ర విమర్శలు చేశారు. అసలు చంద్రబాబు దీక్షని సొంత పార్టీ ఎమ్మెల్యేలే నమ్మడం లేదని వ్యాఖ్యానించారు. అందుకే బాబు దీక్ష చేస్తే 23 మంది ఎమ్మెల్యేలకు 8 మందే హాజరయ్యారని అన్నారు.


చంద్రబాబు ఇసుక దీక్ష విఫలం అయిందని, పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా చంద్రబాబు ఇసుక దీక్షకు జనాన్ని తరలించుకున్నారని అన్నారు. సాధారణంగా చంద్రబాబుకు ఇలాంటి అలవాటేనని, అప్పటిలో అలిపిరి లో ప్రమాదం జరిగినపపుడు ఆయనను పరామర్శించడానికి ఎవరూ రాకపోతే స్కూల్ యాజమాన్యాలతో మాట్లాడి వారిని తన ఇంటికి రప్పించుకునేవారని ఆరోపించారు. అలాగే రైతుల కోసం ఎమ్మెల్యే క్వార్టర్ల్ లో దీక్ష చేస్తానని చెబితే ఎవరూ రాలేదని, దాంతో తన పార్టీ కార్యకర్తలను రైతులుగా చూపించారని ఎద్దేవా చేశారు. అసలు చంద్రబాబుకు ఎవరిపై ప్రేమ ఉండదని, ఆయన కుమారుడిపై తప్ప ఇంకకకరిపై ఉండదని ఆయన అన్నారు.


ఇక గత ప్రభుత్వంలో చంద్రబాబు...లోకేశ్ కుఇసుక దోచి పెట్టారని, పార్టీ ఎమ్మెల్యేలకు ఉచిత ఇసుక ఇచ్చారని ఆరోపించారు. అలాగే బీజేపీని ఆకర్శించేందుకు బాబు కుప్పిగంతులు వేస్తున్నారని విమర్శించారు. అంతకముందు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు..చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సొంత పుత్రుడు, దత్త పుత్తడు దీక్షల తర్వాత చంద్రబాబు దీక్ష మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు. ఇసుకపై చంద్రబాబు దొంగ దీక్ష చేస్తున్నారని, నిన్నటి దీక్షలో చంద్రబాబు... పవన్‌ కల్యాణ్‌, ఎన్టీఆర్‌లను మించి యాక్టింగ్‌ చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: