టిఆర్ఎస్ పార్టీలో కెసిఆర్ తర్వాత నెంబర్ 2 ఎవరు అన్న  ప్రశ్నకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడో  క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. రెండోసారి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కీ పదవి బాధ్యతలు అప్పజెప్పిన  కేసీఆర్... టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై కూడా నిర్ణయం తీసుకునే అధికారం కేటీఆర్ కు  ఇచ్చారని సమాచారం. తెలంగాణ కేబినెట్ విస్తరణలో భాగంగా మరోసారి మంత్రివర్గంలోకి కేటీఆర్ ని తీసుకున్న కేసీఆర్... టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూతురు కవిత కి అప్పజెప్తారు  అని వార్తలు కూడా వచ్చాయి. అయితే కేసీఆర్ మాత్రం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా  కేటీఆర్ నే కొనసాగించారు. 



తాజాగా ఈ నెల 18 న జరగబోయే  శీతాకాల సమావేశాల కోసం ముందు ఏర్పాటు చేసిన పార్టీ ఎంపీల సమావేశానికి కేసీఆర్ అధ్యక్షత వహింటం ప్రస్తుతం తెరాస పార్టీలో  ప్రాధాన్యతను  సంతరించుకుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు ఇలాంటి సమావేశాలన్ని కేసీఆర్  అధ్యక్షతన మాత్రమే జరిగాయి . కేసీఆర్ మాత్రమే పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. టిఆర్ఎస్ పార్టీలో మొదటిసారి ఇలాంటి  సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్  అధ్యక్షత వహించి పార్లమెంట్లో లేవనెత్తాల్సిన   అంశాలు అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేసారు. ఈ సమావేశంతో  మరోసారి టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్  తర్వాత ఆ స్థానం కేటిఆర్ కే అని రుజువు అయింది. ఇదిలా ఉండగా కెసిఆర్ ఆదేశాల మేరకే కేటీఆర్ సమావేశం నిర్వహించి ఎంపీలకు పలు కీలక ఆదేశాలు చేశారని చర్చ కూడా జరుగుతోంది.



 గతంలో కూడా కేసీఆర్ ఆరోగ్యం బాగా లేదని కేటిఆర్ ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు అంటూ వచ్చిన వార్తలపై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్... తన ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని ఇంకో పదేళ్ల వరకు కేటిఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. అంటే ఇంకో పదేళ్ల తర్వాత కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగింది . ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలంగాణలో ఆర్టీసీ సమ్మె హాట్ టాపిక్ గా  ఉంది. కాగా  ఈ నెల 18 నుంచి ప్రారంభమైన ఈ శీతాకాల సమావేశాలు టీడీపీ బీజేపీ ఎంపీలు తెలంగాణ ఆర్టీసీ సమ్మె పై పార్లమెంటులో ఎలా చర్చిస్తారో... వాటిపై ఎలాంటి వ్యూహాలు ఉపయోగించాలనే దానిపై కూడా కేటీఆర్ ఎంపీలకు సూచించినట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: