నీళ్లలో ఉన్న మొసలి ఎంత బలమైందో అందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్న రాజకీయ నాయకుడు కూడా అంతే.. అదే రాజకీయ నాయకుడు అధికారానికి దూరమైతే.. నీళ్లలో నుంచి బయటపడ్డ మొసలిలా అవుతాడు. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి అలాగే ఉంది. అందుకే ఆయన సొంత పార్టీ రక్షణ కోసం.. రాజకీయ ఉనికి కాపాడుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. నిన్నటి వరకూ తిట్టిన బీజేపీని ఇప్పుడు ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.


చంద్రబాబు తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందుకు నేందుకే అత్యంత సన్నిహితులైన నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించారని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే మరికొంత మంది ఎమ్మెల్యేలను కూడా బీజేపీలోకి పంపుతున్నట్లు ప్రయత్నిస్తున్నారట. ఇటీవల నాగపూర్‌ వెళ్లిన ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలతో రహస్య మంతనాలు కూడా జరిపినట్టు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.


టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని.. వారితో కలిసి ప్రయాణం చేయకూడదని బీజేపీ నేతలు నిర్ణయం తీసుకుందన్నారట. ఎలాగైనా బీజేపీతో కలిసి నడిచేందుకు చంద్రబాబు తనకు పరపతి ఉందని, నా వెనుకలా మనుషులు ఉన్నారని చూపించేందుకు ఇసుక దీక్షను చేపట్టారట చంద్రబాబు. ఇద్దరు ఆర్టిస్టులను పక్కన పెట్టుకొని భవన నిర్మాణ కార్మికులంటూ ఫోటోలకు ఫోజులిచ్చారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.


అలిపిరిలో చంద్రబాబుపై దాడి జరిగిన సమయంలో ఆ రోజు కూడా సానుభూతి పొందవచ్చు అని ప్రయత్నం చేశారని వైసీపీ నేత దాడి వీరభద్రరావు అన్నారు. ఆయన్ను ఎవరు కూడా పరామర్శించేందుకు ముందుకు రాకపోవడంతో..రోజుకు 10 బస్సుల్లో స్కూల్‌ పిల్లలను పిలిపించుకొని వారితో మాట్లాడినట్లు ప్రచారం చేశారని తెలిపారు. ఏపీలో వైసీపీ అధినేత జగన్ దూకుడును తట్టుకోవాలంటే బీజేపీ తప్పు తనకు వేరే మార్గం లేదని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ మొన్నటి ఎన్నికల ముందు బీజేపీని తిట్టిన తిట్లు.. పాపం.. ఆ పార్టీ నేతలు అప్పుడే మరిచిపోయేలా లేరు మరి..


మరింత సమాచారం తెలుసుకోండి: