జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రాజ‌కీయంగా మ‌ళ్లీ యాక్టివ్ అవుతున్నారు. ఈ యేడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఘోర‌మైన ఓట‌మి నుంచి కోలుకోక ముందే ప‌వ‌న్ మ‌ళ్లీ త‌న పొలిటిక‌ల్ కార్యాచార‌ణ వేగ‌వంతం చేస్తున్నారు. ఇటీవ‌లే ఏపీలో ఉన్న తీవ్ర‌మైన ఇసుక కొర‌త‌పై పోరాటం చేసిన ప‌వ‌న్ విశాఖ వేదిక‌గా లాంగ్ మార్చ్‌కు పిలుపు ఇచ్చారు. దీనికి మంచి స్పంద‌న ల‌భించింది.


అటు రాజ‌కీయంగా ప‌వ‌న్ కూడా స్పీడ్‌గా కార్య‌క‌లాపాలు కొన‌సాగించ‌చ‌డంతో ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఆరు నెల‌ల‌కే వేడెక్కేసింది. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ ఇటీవలే ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ అయ్యారు. ఏపీలో ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల కష్టాలు, ఆత్మహత్యలపై గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఏపీలో ప్ర‌స్తుతం ఉన్న ఇసుక కొర‌త నేప‌థ్యంలో భ‌వ‌న నిర్మాణ కార్మికులు తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్నార‌ని.. దీనికి ప్ర‌భుత్వం వెంట‌నే చ‌ర్య‌లు తీసుకునేలా చేయాల‌ని కూడా గ‌వ‌ర్న‌ర్‌ను ప‌వ‌న్ కోరారు.


అయితే గవర్నర్ తాను చెప్పిన విషయాల్ని ఎంతో ఓర్పుగా విన్నారని చెప్పుకొచ్చారు పవన్. ఈ సందర్భంగా వారిద్దరి భేటీలో జరిగిన పలు ఆసక్తికర అంశల్ని తన సోషల్ మీడియా పేజీల్లో షేర్ చేసుకున్నారు పవన్. కార్తీక మాసం సందర్భంగా గవర్నర్‌కు ఓ బహుమతి ఇచ్చామన్నారు. మారేడు చెట్టును రాజ్‌భవన్ గార్డెన్‌లో వేసేందుకు ఇచ్చానన్న అంశాన్నిపవన్ ట్వీట్ చేశారు.


ఇక ప‌వ‌న్ హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఉన్న త‌న వ్య‌వ‌సాయ క్షేత్రంలో కూడా ర‌క‌ర‌కాల పండ్ల‌ను పెంచి టాలీవుడ్ హీరోల‌కు పంపిస్తుంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే నితిన్‌తో పాటు ప‌లువురు హీరోలు, ద‌ర్శ‌కుల‌కు కూడా పవ‌న్ ఇలా ఇలా మామిడి, స‌పోటా పండ్ల‌ను పంపించారు. ఈ క్ర‌మంలోనే కొన్ని ర‌కాల చెట్ల‌ను కూడా ఆయ‌న అక్క‌డ పెంచుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే గ‌వ‌ర్న‌ర్‌కు మారేడు చెట్టు బ‌హూక‌రించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: