ఖమ్మం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ కు చెందిన మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం మణుగూరు పోలీస్‌ స్టేషన్‌ లో డీఎస్పీ బి.రాంమాంజనేయులు ఘటన వివరాలను తెలిపారు. గత నెల 27న బాధిత బాలిక తన తల్లికి పరిచయస్తులైన దుమ్ముగూడెం మండలం రామారావుపేట గ్రామానికి చెందిన పూజారి కల్యాణ్‌ కు భద్రాచలం వస్తున్నానని ఫోన్‌ నుంచి ఒక మెస్సేజ్‌ పంపింది. కల్యాణ్‌ బాలికను ద్విచక్రవాహనం పై తన ఇంటికి తీసుకెళ్లి ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి శారీరకంగా కూడా అనుభవించాడు.


అయితే అక్టోబర్‌28 వ తేదీన బాలికను కల్యాణ్‌ భద్రాచలం బస్టాండ్‌ లో దింపాడు. ఆమె మణుగూరుకు వరకు చేరుకుంది. మణుగూరు నుంచి తన చిన్న నానమ్మ గ్రామమైన గంగోలు వెళ్లేందుకు సాయిబాబా గుడి వద్ద మణుగూరుకు చెందిన ముత్తారపు వెంకటేష్‌ ఆటో వద్దకు వచ్చి భద్రాచలం వెళ్లాలని అడిగింది. వెంకటేష్‌ బాలికను తప్పుదారి పట్టించి పర్ణశాల తీసుకెళ్లి సాయంత్రం వరకు బోటు షికారు తిప్పాడు. అనంతరం బాలికతో ఆటోలో వస్తుండగా గంగోలు వద్ద ఆపమన్నా ఆపకుండా తీసుకొచ్చి సారపాక దాటాక రెడ్డిపాలెం వెళ్లే మట్టి దారిలో కొంతదూరం తీసుకొచ్చి బాలికపై అఘాయిత్యానికి పాల్పడాలని  ప్రయత్నించాడు.


అదే ప్రాంతంలో ఉన్న సందెళ్ల రామాపురం గ్రామానికి చెందిన సోడె రాంబాబు ఏలియాస్‌ బాబు, పొడియం సాయి, తెల్లం కృష్ణ, ఆంతోటి ప్రశాంత్, వినయ్‌ లు విషయాన్ని గమనించి ఆటో వద్దకు వచ్చారు. వీరిలో ఇద్దరు కాపలా ఉండి మిగతావారు ఒకరి తరువాత ఒకరు ఆమె పై అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పితే చంపేస్తాం అని బెదిరించి ఆటో డ్రైవర్‌ ను, బాలికను ఆటో ఎక్కించి పంపించారు. దీంతో ఆటో డ్రైవర్‌ బాలికను మణుగూరు గుట్ట మల్లారం లోని శివబాలాజీ లాడ్జ్‌లో గది అద్దెకు తీసుకుని అందులో ఉంచాడు.


ఆటో డ్రైవర్‌ తెల్లవారు జామున బాలికను తిరిగి భద్రాచలం తీసుకెళ్లగా తనపై అత్యాచారం జరిపిన వారిలో ఒకడు వారిని వెంబడించాడు. భయంతో అదే ఆటోలో మణుగూరు లోని ఆంజనేయ స్వామి గుడి వద్దకు చేరుకుంది. ఆటో డ్రైవర్‌ బాలికను భద్రాచలం బస్సు ఎక్కించగా బాలిక సీతారామపురంలోని కల్యాణ్‌ కటింగ్‌ షాప్ వద్దకు వెళ్లింది. కల్యాణ్‌ బాలికను ద్విచక్ర వాహనంపై మళ్లీ భద్రాచలం తీసుకొచ్చాడు. అక్కడ తను బట్టలు మార్చుకోవాలని అడగగా భద్రాచలంలోని సాయిబాబా గుడి ఏరియా వెనక తన స్నేహితుడి రూంకు తీసుకెళ్లి మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.


అక్కడి నుంచి ఆ బాలికను గంగోలులో విడిచిపెట్టాడు. గంగోలులో చిన్న నానమ్మ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలిక తిరిగి భద్రాచలం వచ్చి కల్యాణ్‌ కు ఫోన్‌ చేసి విషయం చెప్పింది. దీనితో కల్యాణ్‌ బాలిక తల్లికి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. దీంతో బాలిక తల్లి, మారు తండ్రి ఆటోలో భద్రాచలం వెళ్లి బాలికను ఇంటికి తీసుక వచ్చారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. అత్యాచారానికి పాల్పడిన అందరినీ అరెస్టు చేశారు, వీరిలో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులు ఉపయోగించిన ఆటోను, ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం పరుచుకున్నారు. వీరి పై మైనర్‌ బాలిక పై అత్యాచార నేరం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ షుకూర్, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: