ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సీఎం యోగి ఆధిత్యనాథ్ ఉత్తరాది రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేయటం వలన కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకోవటంతో పంట వ్యర్థాల దహనాన్ని నిర్మూలించే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారులకు ఇప్పటికే సీఎం యోగి పంట వ్యర్థాల దహనం గురించి కీలకమైన సూచనలు చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ నిన్న యూపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ పీ గోయెల్ తో సమావేశమయ్యారు. 
 
సీఎం గోయెల్ కు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా పంట వ్యర్థాల దహనం జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. రైతులకు పంట వ్యర్థాలను దహనం చేయటం వలన కలిగే దుష్ప్రభావాలను వివరించాలని పంట వ్యర్థాల దహనం వలన వాతావరణ సమతౌల్యత దెబ్బ తిని కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంటోందని చెప్పారు. సంబంధిత అధికారులు పంట వ్యర్థాలను సేంద్రీయ ఎరువులుగా ఉపయోగించుకొనే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం యోగి గోయెల్ కు సూచించారు. 
 
ఈ నెల 13వ తేదీన హరియాణా ప్రభుత్వం పంట వ్యర్థాలను దహనం చేసినందుకు 189 మంది రైతులకు జరిమానా విధించింది. అక్టోబర్ నెలలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పంటల వ్యర్థాలను దహనం చేయవద్దని రైతులను కోరారు. ఉత్తరాది రాష్ట్రాల్లోని రైతులు పంట పూర్తయిన తరువాత పంట వ్యర్థాలను దహనం చేస్తున్నారు. పంట వ్యర్థాలను దహనం చేయటం వలన ఉత్తరాది రాష్ట్రాల్లో గాలి నాణ్యత ప్రమాదకరంగా మారింది. 
 
అందువలన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్యం తగ్గించటానికి తగిన చర్యలు తీసుకుంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ప్రజలు ఢిల్లీ నగరం అంతటా కాలుష్యం నిండిపోవటంతో రోగాలు వస్తాయని భయాందోళనకు గురవుతున్నారు. మరో నగరానికి వెళ్లాలనే ఆలోచనలో 40 శాతం మంది ఢిల్లీ ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: